రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లవర్ ఇంటికి వెళ్లిన బాయ్ ఫ్రెండ్.. దొంగనుకుని చావబాదిన తండ్రి

Hyderabad lovers news Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines TS DSC TET
Peoples Motivation

లవర్ ఇంటికి వెళ్లిన బాయ్ ఫ్రెండ్.. దొంగనుకుని చావబాదిన తండ్రి

గతంలో బాలికను ఇంట్లోంచి తీసుకెళ్లిన కేసులో జైలుకు

45 రోజుల అనంతరం బయటకు వచ్చిన నిందితుడు

తాజాగా బాలిక ఇంటికి వెళ్లి ఆమె తండ్రికి చిక్కిన వైనం

భయపడి గదిలోకి వెళ్లి డయల్ 100కు ఫోన్

తల్లిదండ్రులతో కలిసి వచ్చి విడిపించిన పోలీసులు

హైదరాబాద్‌లోని పాతబస్తీ బండ్లగూడలో ఘటన

Hyderabad lovers news Telugu daily news today Telugu daily news newspaper today Telugu daily news epaper today Telugu daily news headlines TS DSC TET

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

లవర్ ని కలుసుకునేందుకు తెల్లవారుజామున ఆమె ఇంటికి వెళ్లాడో ప్రియుడు. అలికిడికి లేచిన ఆమె తండ్రి దొంగ చొరబడ్డాడనుకుని పట్టుకుని చావబాదాడు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

హైదరాబాద్ బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన అబ్దుల్ సోహైల్ (25) పక్క బస్తీలోని ఓ వ్యక్తి భవనంలో ఏడాది క్రితం గ్లాస్ ఫిటింగ్ వర్క్ చేశాడు. ఆ సమయంలో ఆయన కుమార్తె(17)పై మనసు పడ్డాడు. ఆ తర్వాత అది మరింత ముదరడంతో బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. 

బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోహైల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. 45 రోజుల అనంతరం జైలు నుంచి ఇటీవల బయటకు వచ్చిన సోహైల్ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో బాలిక ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో నమాజు కోసం లేచిన బాలిక తండ్రి యువకుడిని చూసి దొంగనుకుని పట్టుకుని చితకబాదాడు. ఆ తర్వాత అతడిని సోహైల్‌గా గుర్తించాడు.

తననేమైనా చేస్తాడేమోనని భయపడిన నిందితుడు వెంటనే ఓ గదిలోకి దూరి డోర్ వేసేసుకున్నాడు. ఆపై డయల్ 100కు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించాడు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి యువకుడిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

-Advertisement-