రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గూగుల్ వాలెట్ ఎలా వాడాలి..? దీని ఉపయోగాలు..?

google wallet india google wallet apk google wallet uses google wallet iphone google wallet login google wallet app for android google wallet how to u
Peoples Motivation

గూగుల్ వాలెట్ ఎలా వాడాలి..? దీని ఉపయోగాలు..?

google wallet india google wallet apk google wallet uses google wallet iphone google wallet login google wallet app for android google wallet how to use
గూగుల్ వాలెట్ ను బుధవారం ఇండియాలో ప్రారంభించారు.  ఇది ఒక డిజిటల్ వాలెట్ మాత్రమే. చెల్లింపులకు సంబంధించిన ఫీచర్లేవీ ఉండవు. మూవీ టికెట్లు, గిఫ్ట్ కార్డులు, బోర్డింగ్ పాసుల వంటి వాటి ఈజీ స్టోరేజీ, యూసేజీ కోసం ఈ వాలెట్ ను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం వివిధ కంపెనీలతో గూగుల్ జట్టు కట్టింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

మూవీ టికెట్స్

సినిమా టికెట్లను వాలెట్లో భద్రపరుచుకునేందుకు పీవీఆర్, ఐనాక్స్ గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ వేదికల ద్వారా కొనుగోలు చేసిన టికెట్లు వాలెట్లో ఆ యాప్ / సర్వీసు నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు.

బోర్డింగ్ పాస్

ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలతో పాటు మేక్మై ట్రిప్, ఇక్సిగో వంటి సంస్థలతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో విమానాశ్రయాల్లో గూగుల్ వాలెట్ను బోర్డింగ్ పాస్ గానూ వినియోగించుకోవచ్చు.

గిఫ్ట్ కార్డులు

ఫ్లిప్కార్ట్, డామినోస్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లు అందించే లాయల్టీ, గిఫ్ట్ కార్డులనూ గూగుల్ వాలెట్లో లోడ్ చేసుకోవచ్చు.

మెట్రో టికెట్లు

హైదరాబాద్, కోచి మెట్రోతో పాటు అబి బస్ వంటి కంపెనీలతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా టికెట్లను వాలెట్ ద్వారా కొనుగోలు చేసి సేవ్ చేసుకోవచ్చు.

మెయిలొకొచ్చే టికెట్లు

రైలు టికెట్లు, మూవీ టికెట్లకు సంబంధించిన సమాచారం ఒకవేళ మన మెయిల్ కొస్తే ఆటోమేటిక్ గా ఆ వివరాలు వాలెట్లో ప్రత్యక్షమవుతాయి.

ఫిజికల్ డాక్యుమెంట్లు

క్యూఆర్ కోడ్స్ కలిగిన బోర్డింగ్ పాస్, లగేజీ ట్యాగ్స్ వంటి ఫిజికల్ డాక్యుమెంట్లనూ పాస్ల రూపంలో వాలెట్లో లోడ్ చేసుకోవచ్చు.


Comments

-Advertisement-