రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాటిల్స్ లో డీజిల్, పెట్రోల్ అమ్మవద్దు...

No fill bottles in petrol Fuel no fill in bottles Ap latest news Ts latest Breaking news Peoples motivation news Pm news telugu Telugu daily news ECI
Peoples Motivation

బాటిల్స్ లో డీజిల్, పెట్రోల్ అమ్మవద్దు...

బంకుల ఎదుట నోటీసులు అంటించాలని సూచన

ఎన్నికల అనంతర హింసలో పెట్రోల్ బాంబుల వాడకమే కారణం

No fill bottles in petrol Fuel no fill in bottles Ap latest news Ts latest Breaking news Peoples motivation news Pm news telugu Telugu daily news ECI

ఏపీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పెట్రోల్ బంకు నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
 ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్త మయ్యారు. పెట్రోల్ బంకుల్లో వాహనా లకు మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటి ళ్లలో పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదే శాలుజారీ చేశారు. ఎన్నికల నియమావ ళిని ఉల్లంఘిస్తే అనంతర పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహిం చాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్ బాంబులు ( పెట్రోల్ బాటిల్స్) తో దాడి చేసిన ఉదం తాలు బయటపడటంతో పెట్రోల్ బంకుల డీలర్లకు పోలీసు, ఎన్నికల ఉన్నతాధికారు లు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై పెట్రోల్ బంకు ల్లో వాహనాలకు మాత్రమే ఆయిల్ పోసాలా, బాటిళ్లు, క్యాన్లలో ఆయిల్ పోయకుం డా నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడ రేషన్ ఆఫ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేరం రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటించే లా బంకుల డీలర్లకు ఆదేశాలు జారీ చే శారు. 'ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్ అమ్మబ డుదు' అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు.

Comments

-Advertisement-