ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పరీక్ష రాసే విద్యార్థులు ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఫోటో, సంతకం, పేరు, మీడియం తో సహా ఏ సబ్జెక్టులు రాస్తున్నామో వాటిని గమనించాలని వాటిలో ఏమైనా తప్పులు ఉంటే తక్షణమే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ను సంప్రదించాలి. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకాలు లేకపోయినప్పటికీ పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఇంటర్ బోర్డు చీఫ్ సూపర్డెంట్ లకు ఆదేశాలు జారీ చేశారు. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రోజుకు రెండో సెషన్లలో పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి