నాయకుల్లో సర్వేల గుబులు..! ప్రజల నాడీ పసిగట్టలేని.. సర్వేలు.!
నాయకుల్లో సర్వేల గుబులు..!
ప్రజల నాడీ పసిగట్టలేని.. సర్వేలు.!
సర్వేల పేరుతో వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం!
గెలుపు ధీమాతో ఇరుపార్టీలు..!
కర్నూల్ జిల్లాలో కూటమికి ఆరు, వైకాపాకు ఎనిమిది సీట్లు అంటున్న విశ్లేషకులు!
కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్నికల సర్వేల పేరుతో నిర్వహించిన సర్వేల్లో.. ఏ పార్టీ గెలుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.. సర్వేల పేరుతో ఆయా సంస్థల ఉనికిని కాపాడుకునేందుకు వైకాపా పార్టీకి కొన్ని,, కూటమికి ఇన్నియని, వారికి వారి అంచనాలు వేస్తూ.. సర్వేలో చెప్పడంతో ప్రాథమిక స్థాయిలో ప్రజలు ఎటువైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరుపార్టీలు డోలాయమాన పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని సర్వేలు వైకాపా పార్టీ అధికారంలోకి వస్తుందని, మరికొన్ని సర్వేలైతే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో స్థానిక నాయకులు వారి అంచనాలను బట్టి సర్వేలకు సరిపోల్చలేకపోవడంతో ఏది నిజమో.. తెలియని పరిస్థితి నాయకుల్లో నెలకొంది. ఒకవైపు ప్రజలు. అభిప్రాయాలు.. మరోవైపు సర్వేల అభిప్రాయాలు పొంతన లేకపోవడంతో విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి...! రాష్ట్రంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే... కర్నూల్ విషయానికొస్తే ఈ సర్వేలు మరీ భయపెడుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానలైతే తప్పుకు దొరక్కుండా 50-50 ఛాన్స్ అంటూ చేతులు దులుపుకుంటున్నారు. మరికొన్ని సర్వేలైతే అధికార పార్టీకి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఎవరికి వారే ఇష్టం వచ్చిన అంకెలు చెప్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలున్నప్పటికీ సర్వేలు ప్రకారం
మొదట్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని అనుకున్నప్పటికీ ఓటు సర్వేలను బట్టి ప్రజల నాడీని తెలుసుకున్న కార్యకర్తలు తప్పుడు అంచనాకు వస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మాదిరిగా విజయాలు ఉండవని.. ఈసారి గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు టీడీపీ కి అనుకూలంగా ఉందని అయితే ఉద్యోగులు.. యువత కూటమి వైపు అనుకూలంగా కనిపిస్తున్నాయని, అందువల్ల పోటీ పూర్తి స్థాయిలో ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం.! ఇక డోన్ నియోజకవర్గానికి వస్తే గతంలో మాదిరిగా బుగ్గన విజయం సులువు అనుకున్నప్పటికీ... అనుహ్యరీతి లో టీడీపీ కి బుగ్గన కి పోటీగా కోట్ల ని పార్టీ ప్రస్థానంలోకి తీసుకురావడం.. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత మ్మ అందర్నీ కలుపుకుంటూ పోటీని తీవ్రతరం చేశారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు విజయాలు కూడా అంత ఈజీ కాదు అయితే ప్రజల అభిప్రాయాలను బట్టి కోట్ల కు కాస్తంత మెరుగనిపిస్తుంది. అరకొర ఆధిపత్యంతో విజయం సాధించవచ్చునని కొందరి అభిప్రాయం..
నియోజకవర్గాల పరిస్థితి ఇంచుమించుగా... ఇక కర్నూల్,బనగానపల్లె, ఆళ్లగడ్డ, శ్రీశైలం
నియోజకవర్గం వస్తే ఏకపక్షంగా తెలుగుదేశం గెలుస్తుందని ప్రజలు బాహాటంగానే చెప్తున్నారు. కూడా తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యపోరుని కొనసాగిస్తూ ఓటు బ్యాంకులో పైచేయి అనిపించుకున్నారు. అయినప్పటికి ఓటు ఊహించిన విధంగా ఓటింగ్ శాతంపెరగడంతో నాయకుల్లో గుబులు ప్రారంభమైనది. అలాగే విషయానికొస్తే గెలుపు ఈజీ అనుకున్నప్పటికీ తమదైన శైలిలో ఓట్లు తిప్పుకునే పరిస్థితి రావడంతో గెలుపు కూడా అంత ఈజీ కాదు.! ఆదోని విషయానికొస్తే బీజేపీ అభ్యర్థి వైకాపా పార్టీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మళ్లీ వైస్సార్సీపీ కి ఎక్కువ అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. ఆలూరు విషయానికొస్తే కులం కార్డు పని చేసినట్టు కనిపిస్తుంది. దీంతో ఓటు బ్యాంకు కొంత గల్లంతయింది. అందువల్ల విజయం ఈజీగా కనిపించడం లేదు.ఇక ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గం వస్తే వైస్సార్సీపీ కి దాదాపు ఖరారు అయినట్టుగా విశ్లేషకులు అంటున్నారు.. ఏ కోసాను కూడా అవకాశాలు లేకపోవడంతో చివరి నిమిషంలో చేతులెత్తేసినట్టు కార్యకర్తలు అంటున్నారు. ఈ విధంగా నియోజకవర్గ పరిస్థితి ఉంటే సర్వేల పేరుతో నాయకుల వద్ద మెహర్బానీకి తప్పుడు సర్వేలు ఇవ్వడం.. ఎవరిని నమ్మాలో.. ఎవర్ని నమ్మకూడదో.. నాయకులకు తెలియని పరిస్థితి.. మరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎన్నికల రిజల్ట్స్ వరకు వేచి చూడాలి. మరెన్ని రాజకీయ వార్తా విశ్లేషణ కథనాలతో మళ్ళీ కలుద్దాం..✍️