ఏ పక్క తిరిగి పడుకుంటే మంచిది??
sleeping on left side bad for heart
why you should never sleep on your right side
what is the healthiest sleeping position
best sleeping position for
By
Peoples Motivation
ఏ పక్క తిరిగి పడుకుంటే మంచిది??
పడుకునేటప్పుడు ఏ పక్క నిద్రిస్తే ఏంటి లాభాలని ఎప్పుడైనా ఆలోచించారా..!
ఎడమవైపు పడుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. శరీరంలోని మలినాలను తొలగించాలంటే ఎడమ పక్కకి తిరిగి నిద్రపోవాలి. దీనినే డీటాక్సిఫికేషన్ అంటారు. తలనొప్పి, దీర్ఘకాలిక అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్ట కింది భాగంలో ప్లీహము ఉంటుంది. దీనితో అనేక భాగాలకు సంబంధం ఉంటుంది. ఎడమ వైపు పడుకుంటే శరీరంలోని ఈ వ్యవస్థకు రక్త సరఫరా మెరుగవుతుంది. గర్భిణీ స్త్రీలు ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డ కదిలేందుకు వీలుగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది. వెన్నెముక, మోకాళ్లు సపోర్టుగా నిలుస్తాయి. గుండెకు రక్త సరఫరా తేలికగా జరుగుతుంది. కాబట్టి గుండెపోటు సంబంధిత జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఎడమవైపు నిద్రించడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. రక్తసరఫరా వేగంగా జరగడం వల్ల మలినాలు తొలగిపోతాయి. భోజనం తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకుంటే జీర్ణ క్రియకు అవసరమైన ప్యాంక్రియాటిక్ ఎంజైములు విడుదలవుతాయి. దీంతో ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. వెన్నెముకను దృఢంగా ఉంచడంతో పాటు కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. కుడి వైపునకు తిరిగి నిద్రించే వారికి గుండెల్లో మంట అజీర్తి వంటి సమస్యలు వస్తున్నాయని చాలా అధ్యయనాల్లో తేలిందని నిపుణులు పేర్కొంటున్నారు.
Comments