పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా వేయాలి..? ఎక్కడ ఓటు వేయ్యాలి..?
postal ballot means
postal ballot meaning in telugu
postal.ballot.last date
postal ballot upsc
postal ballot meaning Telugu
postal ballot introduced
By
Peoples Motivation
పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా వేయాలి..?
ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే విధానం పూర్తిగా రహస్య ఓటింగ్ పద్ధతిలో ఉంటుంది. గతంలో బహిరంగంగా ఓటు వేసి పోస్టు ద్వారా పంపుతుండడంతో దుర్వినియోగం అవుతుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిం ది. పటిష్ట పోలీసు బందోబస్తు, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ను ఉద్యో గులు వినియోగించుకోవాల్సి ఉంటుంది.
- 13ఏ డిక్లరేషన్లో బ్యాలెట్ పేపర్ సీరియల్ నంబర్ నమోదు చేయాలి.
- డిక్లరేషన్లో ఓటరు తప్పకుండా సంతకం చేయాలి
- డిక్లరేషన్ పై అటెస్టేషన్ తప్పనిసరిగా ఉండాలి. పోస్టల్ బ్యాలెట్ పై అభ్యర్థి పేరకు సంబంధించిన ఎంపిక చేసిన స్థలంలో టిక్ లేదా ఇంటు గుర్తుపట్టాలి.
- పోస్టల్ బ్యాలెట్ పై సంతకం కానీ, పేరు కానీ రాయకూడదు.
- ఓటు నమోదు చేసిన తరువాత పోస్టల్ బ్యాలెట్ ను 13బీ కవర్ లో పెట్టి అతికించాలి.
- 13బీ కవర్ పైన పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ ను తప్పనిసరిగా రాయాలి.
- 13బీ కవర్ ను డిక్లరేషన్ 13సీ కవర్ లో పెట్టి సీలు వేయాలి.
ఎక్కడ ఓటు వేయ్యాలి..?
→జిల్లాలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు ఏ నియోజకవర్గంలో ఓటు ఉంటుందో ఆ నియోజకవర్గానికి సంబంధిం చిన ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఓటు వేయాలి
→ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు వారు పనిచేస్తున్న నియోజకవ ర్గంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంట ర్ లోనే ఓటు వేయాలి.
→ ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు తమ సొంత జిల్లాలోని నియోజకవర్గాలకు వెళ్లకుండా పనిచేసే ప్రదేశంలోనే ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలోనే పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలి. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్లినా పోస్టల్ బ్యాలెట్ ఉండదు.
Comments