-Advertisement-

రాయలసీమలో బలిజలు ఎటు వైపు..?

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

రాయలసీమలో బలిజలు ఎటు వైపు..?

Rayalaseema balijalu district wise
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది గ్రేటర్ రాయలసీమ. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో 52 సీట్లకు గాను కుప్పం, ఉరవకొండ, హిందూపురం మినహా అన్ని స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది‌. దాదాపు అన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీకి అండగా నిలిచాయి. కానీ.. ఈసారి మాత్రం అందులో బలిజల సహకారం అనుమానమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాపులనే రాయలసీమ ప్రాంతంలో బలిజలుగా పిలుస్తారు. కానీ.. ఈ విడత సీమలో ఆ సామాజికవర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. దీంతో బలిజ ఓటర్లు, బలిజ నాయకులు గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగడం ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది పెద్దలు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. దాదాపు పాతిక నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి వాళ్ళది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రాజంపేట లోక్ సభ పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక తిరుపతి పార్లమెంటులో అయితే తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్స్ లలో ఎక్కువగా ఉన్నారు బలిజలు. కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్, బనగానపల్లె, పాణ్యం, ఆదోనిలో నియోజకవర్గాల పరిధిలో బలిజల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో వీరి వల్ల అత్యధికంగా లబ్ది పొందింది కూడా వైసీపీయేనన్నది ఓ పరిశీలన. అయినాసరే.. ఈ విడత మొత్తం 52 నియోజకవర్గాల్లో ఎక్కడా బలిజ అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదు అధికార వైఎస్ఆర్సిపీ పార్టీ. దీంతో తీవ్రంగా రగిలిపోతున్నారట ఆ కాపు, బలిజ సామాజికవర్గం నేతలు. దీనికితోడు తనకు రాజ్యసభ ఇస్తామని చెప్పి.. హ్యాండిచ్చారంటూ జనసేనలో చేరిపోయారు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అదే సమయంలో ఆయనకు తిరుపతి టిక్కెట్ ఇచ్చింది జనసేన. అటు రాజంపేటలో కాపునేత బాల సుబ్రమణ్యంకు టిక్కెట్ ఇచ్చింది టీడీపీ. ఇలా కూటమిలోని రెండు పార్టీలు చెరో సీటు బలిజలకు ఇవ్వడంతో తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎఫెక్ట్ పడకుండా పెద్దిరెడ్డి లాంటి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బలిజలకు కీలమైన పదవులు ఇచ్చామని, ప్రాధాన్యత పరంగా ఎలాంటి డౌట్స్ అవసరం లేదని వివరిస్తున్నారట. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని విధంగా రాయలసీమలో ప్రచారానికి టిడిపి వంగవీటి రాధాను దింపింది. దీంతో పరిస్థితులు ఎక్కడ చేయిదాటి పోతాయోనని వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వంగవీటి రాధా ఇప్పటికే చిత్తూరు, మదనపల్లె నియోజకవర్గాల్లో కూటమి తరపున ప్రచారం చేశారు. త్వరలో చంద్రగిరి, పుంగనూరు, నగరి సహా బలిజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పర్యటించేలా రూట్ మ్యాప్ రెడీ అవుతోందట. ఇప్పటికే సీటు ఇవ్వకపోవడంతో ఆగ్రహంగా ఉన్న బలిజలు.. రాధా ప్రచారంతో ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. బలిజల ఓట్లు దూరమైతే.. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఇబ్బంది ఉంటుదని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దల అడుగులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బలిజ ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో బలిజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం వైసీపీ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది... వాస్తవంగా చరిత్రను గమనిస్తే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఉన్నప్పుడు బలిజలు బీసీ జాబితాలో చేర్చబడ్డారు. తదనంతరం నీలం సంజీవరెడ్డి మరియు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు హయాంలో ఓసి జాబితాలోకి చేర్చబడ్డారు. 2004 ఎన్నికల అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో వైయస్సార్ కాపు, బలిజలు ఓట్ల శాతం ఎక్కువ ఉండడంతో అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలోకి చేరుస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట తప్పారు. తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం చేపట్టడంలో ముఖ్యపాత్ర వహించినటువంటి కాపు, బలిజలకు కాపు రిజర్వేషన్లను బహుమతి ఇస్తూ మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేసి, కాపు సామాజిక వర్గం సామాజిక ఆర్థిక, రాజకీయ పరంగా వెనుక పడ్డారు అని మంజునాథ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తో నాటి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకీభవించి బీసీలకు ఇబ్బంది లేకుండా బీసీ(ఎఫ్) ప్రత్యేకత తరగతిలో బలిజలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు చేసి, పార్లమెంట్ కు పంపడం జరిగింది. బిల్లు పంపిన కొన్ని రోజుల్లోనే వెంటనే 2019 ఎన్నికలు ప్రకటన వెలువడటంతో బిల్లుపై ఇంకా ఎటువంటి చర్చగానీ,ఆమోదం గాని జరగలేదు. 2019 ఎన్నికల్లో బీసీలకు కాపులకు రిజర్వేషన్స్ అమలు చేయలేము అని అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం కేంద్రం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లు కోటాలో కూడా ఐదు శాతం రిజర్వేషన్లను కాపు బలిజలకు అమలు చేయలేమని చెప్పి కాపు, బలిజలలను నిలువునా మోసం చేసింది . దీనితో వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కాపు ఓటర్లు కోస్తాలో, రాయలసీమ లో బలిజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ప్రతి ఒక్కరి మాట చంద్రబాబు నాయుడు హయాంలోనే కాపు, బలిజలల యొక్క అభివృద్ధి, సంక్షేమం కొనసాగించబడింది అని సమాచారం. కాపు, బలిజల యొక్క అభివృద్ధి, సామాజిక రాజకీయ, ఆర్థిక ప్రగతి చంద్రబాబు హయాంలోని జరిగింది అనే మాట వాస్తవం. కావున మా కాపు, బలిజలు మద్దతు టిడిపి బిజెపి జనసేన కూఓటములకే అని బాహాటంగా పేర్కొంటున్నారు. దీనితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్య మంత్రి గా పని చేసిన మరియు కాపు, బలిజలు యొక్క అభివృద్ధి సంక్షేమం, ప్రగతి కోసం కృషి చేసిన నారా చంద్ర బాబు నాయుడుకి కాపు, బలిజ వర్గీయులు పెద్ద ఎత్తున మద్దతు తెపుతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం.

✍️✍️

బిజెపి యువ నాయకుడు& పూర్వ సివిల్స్ విద్యార్థి కొట్టె మల్లిఖార్జున

Comments

-Advertisement-