AP EAPCET RESULTS# ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాల విడుదల.. అప్పుడే..? అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా..
AP EAPCET RESULTS# ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాల విడుదల.. అప్పుడే..? అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా..
అమరావతి (పీపుల్స్ మోటివేషన్):-
ఇటీవలే ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లకు కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,58,373 మంది హాజరయ్యారని, 94.22 శాతం హాజరు నమోదైనట్టు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన పరీక్షలకు అన్ని సెషన్లకు కలిపి 88,638 మంది హాజరుకావాల్సి ఉండగా 80,766 మంది హాజరయ్యారని, 91.12 శాతం హాజరు నమోదైందని తెలిపారు.
ఇందులో భాగంగానే.. ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లును చేస్తున్నారు. ఏపీ ఈఏపీసెట్ (ఎంసెట్) ప్రిలిమినరీ కీ ని విడుదల చేసిన విషయం తెల్సిందే. AP EAMCET 2024 ఫలితాలను మే 31వ తేదీన లేదా.. జూన్ మొదటి వారంలో విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. AP EAMCET 2024 ఫలితాల విడుదలతో పాటు.. కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.