AP EAMCET# ముగిసిన ఏపీఈఏపీ సెట్ ప్రాధమిక కీ విడుదల
AP EAMCET# ముగిసిన ఏపీఈఏపీ సెట్ ప్రాధమిక కీ విడుదల
అమరావతి, మే 23 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీఈఏపీసెట్-2024 ఆన్లైన్ ఇంజనీరింగ్ విభాగం ప్రవేశ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లోని 49 ప్రాంతీయ కేంద్రాల్లో గురువారం ఉదయం సెషన్ తో ప్రశాంతంగా ముగిసినట్టు సెట్ చైర్మన్, వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఏపీఈ ఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగానికి అన్ని సెషన్లకు కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,58,373 మంది హాజరయ్యారని, 94.22 శాతం హాజరు నమోదైనట్టు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన పరీక్షలకు అన్ని సెషన్లకు కలిపి 88,638 మంది హాజరుకావాల్సి ఉండగా 80,766 మంది హాజరయ్యారని, 91.12 శాతం హాజరు నమోదైందన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించిన పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేయడంతో పాటూ రెస్పాన్స్ షీట్స్ను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల వరకూ ప్రాథమిక కీ పై విద్యార్థులకు అభ్యంతరాలుంటే తెలియచేయవచ్చన్నారు. అదే విధంగా ఇంజనీ రింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షల ప్రాథమిక కీ ని శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదలచేస్తామని, ఈనెల 26వతేదీ ఉదయం 10 గంటల వర కూ ప్రాథమిక కీ పై విద్యార్థులకు అభ్యంతరాలుంటే తెలపవచ్చని కన్వీనర్ కె. వెంకటరెడ్డి తెలిపారు. ఏపీఈఏపీ సెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి 25శాతం వెయిటేజీ మార్కులను ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా తీసుకోనున్న నేపథ్యంలో ఏపీ రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులు కాకుండా ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు తమ మార్కులను ఏపీఈఏపీసెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, వాటి ద్వారా వారికి ర్యాంకులు కేటాయిస్తారని కన్వీనర్ తెలిపారు.