జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు
జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు
జూన్ 9న జరగనున్నతెలంగాణ గ్రూప్-1 పరీక్షకు విషయం తెలిసిందే అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. అవేంటో చూద్దాం..
టీజీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులకు కీలక సూచనలు
■అభ్యర్థులకు వ్యక్తిగత సమాచారం ముద్రించిన ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. అభ్యర్థులు ఓంఎఆర్, ప్రశ్నపత్రంలో ముద్రించిన నిబంధనలు సూచనలు పాటించాలి.
■అభ్యర్థుల సౌకర్యార్థం నమూనా ఓఎంఆర్ ను కమిషన్ వెబ్సైట్లో ఇప్పటికే ఉంచారు. ఈ కాపీని డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనల ప్రకారం సరైన విధానంలో వివరాలు రాయడంతో పాటు బబ్లింగ్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి.
■ అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష ముగిసేవరకు పరీక్ష కేంద్రాన్ని విడిచి వెళ్లకూడదు. పరీక్ష ముగిశాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్ కు అప్పగించాలి.
■హాల్ టికెట్లపై ముద్రించిన సూచనల కాపీని వెబ్సైట్లో పొందుపరిచారు. సూచనలు జాగ్రత్తగా చదివి, వాటిని పరీక్ష సమయంలో పాటించాలి. అభ్యర్థులు చేసే పొరపాట్లకు, ఓఎంఆర్, హాల్ టికెట్లలోని నిబంధనలు పాటించకుంటే కమిషన్ ఎలాంటి బాధ్యతా వహించదు.
■పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు చెప్పులు మాత్రమే వాడాలి. బూట్లు ధరించకూడదు.
■ అభ్యర్ధులకు బయోమెట్రిక్ ను పరీక్ష కేంద్రంలో ఉదయం 9.30 నుంచి ప్రారంభిస్తారు.