బిగ్ షాక్ ఆ రాష్ట్రంలో ఈరోజు నుంచి 5 రోజుల పాటు వైన్స్ బంద్..
Tomorrow bar open or not in Karnataka
List of dry days in Bangalore 2024
Wine Shop timings in Bangalore today
Is MRP open today in Bangalore
MRP closi
By
Peoples Motivation
బిగ్ షాక్ ఆ రాష్ట్రంలో ఈరోజు నుంచి 5 రోజుల పాటు వైన్స్ బంద్..
ఫలితాల 48 గంటల ముందు మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం..
జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు..
జూన్ 6న శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు..
వరుసగా 5 రోజులు డ్రై డే..
బెంగళూరు, (పీపుల్స్ మోటివేషన్):-
కర్ణాటకలో జూన్ 1 నుంచి 5 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర శాసన మండలి ఎన్నికల ఫలితాల కారణంగా జూన్ మొదటి వారంలో కనీసం ఐదు రోజుల పాటు కర్ణాటకలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ఓటింగ్, జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న క్రమంలో.. జూన్ 1 నుంచి 4 వరకు మద్యం అమ్మకాలు బంద్ కానున్నాయి. శాసన మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 6న కూడా డ్రై డేగా వ్యవహరిస్తారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ఎన్నికలకు కనీసం 48 గంటల ముందు మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రకారం.. పైన పేర్కొన్న తేదీలలో మద్యం ఉత్పత్తి, అమ్మకం, పంపిణీ, రవాణా, నిల్వ నిషేధించబడుతుందని తెలిపారు. మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, మద్యం అందించే ఏ ఇతర ప్రైవేట్ స్థలాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో మందుబాబులు వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ముందస్తుగా మద్యం తెచ్చుకునేందుకు వైన్స్ షాపుల ముందు బారులు తీరడంతో.. శుక్రవారం మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ ఏర్పడింది.
Comments