పోలింగ్ కి 48 గంటలు ముందు సైలెన్స్ పీరియడ్
పోలింగ్ కి 48 గంటలు ముందు సైలెన్స్ పీరియడ్
144 సెక్షన్ అమలు..
వైన్ షాప్ బంద్..
డ్రైవర్తో కలిపి ఐదు మంది కంటే ఎక్కువ ఉండకూడదు
- జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన

పోలింగ్ కి 48 గంటలు ముందు అనగా మే 11 వ తేది సాయంత్రం 6 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ మొదలవుతుందని, ఆ సమయంలో అభ్యర్థులు లౌడ్ స్పీకర్లు గాని, క్యాంపెయిన్ లు గాని చేయకూడదని,
ముఖ్యంగా మే 11 వ తేది సాయంత్రం 7 గంటల నుండి పోలింగ్ పూర్తయ్యే సమయం వరకు డ్రై డే గా ప్రకటించడం జరుగుతుందని, ఆ సమయంలో వైన్ షాప్ లు కూడా మూసి వేసి ఉండాలన్నారు. అదే విధంగా పోలింగ్ పూర్తయి, మెషీన్ లు అన్ని స్ట్రాంగ్ రూమ్ లకు వెళ్లే వరకు కూడా 144 సెక్షన్ అమలు లో ఉంటుందన్నారు.
పోలింగ్ రోజున అభ్యర్ధి, ఏజెంట్ తో పాటు మరో వాహనాన్ని మాత్రమే అనుమతించబడుతుందని, అందులో కూడా ప్రతి వాహనంలో డ్రైవర్తో కలిపి ఐదు మంది కంటే ఎక్కువ ఉండకూడదని ఒకవేళ వాటి మీద ఉల్లంఘన జరిగినట్లయితే తన దృష్టికి తీసుకొని రావాలని మీడియా ప్రతినిధులకు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.