బస్సు బోల్తా ఇద్దరు మృతి 40 మందికిపైగా గాయాలు
Bus accident in Kurnool
Road accident news
Road safety news
Telugu latest news
ts tet
Ts dsc
Ap tet
Teacher eligibility test
APPSC Group 2
Daily news
By
Peoples Motivation
బస్సు బోల్తా ఇద్దరు మృతి 40 మందికిపైగా గాయాలు
కర్నూలు, మే 23 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి 40 మందికిపైగా ప్రయాణికులతో ఆదోనికి వెళ్తున్న బస్సు గత అర్ధరాత్రి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి (13), గోవర్ధని (8) అనే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు కోడుమూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బస్సు డ్రైవర్ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా నడపడంతో కోడుమూరు-ప్యాలకుర్తి మధ్య ప్రమాదం జరిగింది.
Comments