రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అదిరిపోయే ఫీచర్లతో..‘నోకియా 3210’ ఫీచర్ ఫోన్లు..రీ-లాంచ్ చేసిన నోకియా

Nokia 3210 4G price in India Nokia 3210 4g price Nokia 3210 price Nokia 3210 new Nokia 3210 5G Nokia 3210 old Nokia 3210 4g buy online Nokia mobiles
Peoples Motivation

అదిరిపోయే ఫీచర్లతో..‘నోకియా 3210’ ఫీచర్ ఫోన్లు..రీ-లాంచ్ చేసిన నోకియా

రీ-లాంచ్ చేసిన నోకియా కంపెనీ

ధర సుమారు రూ.4000గా నిర్ణయం

యూరప్ దేశాలు, చైనాలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఫోన్లు

1990 దశకంలో అత్యంత ఆదరణ పొందిన నోకియా 3210 మోడల్ ఐకానిక్ ఫీచర్ ఫోన్లు మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేశాయి. సుమారు 25 సంవత్సరాల అనంతరం 4జీ కనెక్టివిటీతో సరికొత్త వేరియంట్ల ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. యూజర్లు యూట్యూబ్ షార్ట్స్‌ని కూడా ఈ ఫోన్లలో వీక్షించవచ్చు. సీవైసీ 349 మోడల్ హ్యాండ్‌సెట్ ధర దాదాపు రూ. 4,000గా ఉంది. చైనాలో నోకియా అధికారిక వెబ్‌సైట్‌పై ఫోన్లను అందుబాటులో ఉంచగా విపరీతమైన డిమాండ్ కనిపించిందని కంపెనీ తెలిపింది.

Nokia 3210 4G price in India Nokia 3210 4g price Nokia 3210 price Nokia 3210 new Nokia 3210 5G Nokia 3210 old Nokia 3210 4g buy online Nokia mobiles

అదిరిపోయే ఫీచర్లతో..

కాగా నోకియా 3210 ఫోన్‌ను అప్‌డేట్లతో కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఫోన్ డిజైన్‌లో మార్పులు చేయడంతో పాటు కొత్త ఫీచర్లను అందించింది. 4జీ సామర్థ్యాలతో పనిచేస్తుంది. 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, యూనీసాక్ టీ107 ప్రాసెసర్‌,తో 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీని 32జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ఫోన్ ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

యూఎస్‌బీ టైప్ సీ ఛార్జింగ్ ఫీచర్‌తో 1,450 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీని కలిగివుంది. ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 9.8 గంటలపాటు ఫోన్ మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌ రెండు 4జీ సిమ్‌లకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్‌తో పాటు ఇతర కనెక్టివిటీ ఫీచర్లకు కూడా ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌తో ముందు, వెనుక భాగంలో కెమెరాలు కూడా వచ్చాయి. ఎఫ్ఎం రేడియోతో పాటు ఎంపీ3 ప్లేయర్ క్లౌడ్ యాప్ సపోర్ట్‌తో పని చేస్తుంది. 

యూరప్, చైనాల్లో అవుట్ ఆఫ్ స్టాక్..

యూరప్ దేశాలు, చైనాలో ఈ ఫోన్ అమ్మకానికి వచ్చిన వెంటనే 'అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డు ప్రదర్శించాల్సి వచ్చిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతలా ఫోన్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఫోన్‌ కొనుగోలుకు యూజర్లు ఎగబడ్డారని సమాచారం. మే 8న అమ్మకానికి అందుబాటులో ఉంచగా కేవలం 2 రోజుల్లోనే ఫోన్లు మొత్తం అమ్ముడుపోయినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. నలుపు, బంగారం, నీలం మూడు రంగుల వేరియంట్‌లలో అమ్మకానికి ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయని తెలిపాయి.

Comments

-Advertisement-