రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అక్కడ మందు బాబులకు శుభవార్త కొత్తగా 27 రకాల బీర్లు

Telangana beer brands with price Telangana beer brands list Beer price in Hyderabad Today Budweiser beer price in Telangana Telangana new brand beers
Peoples Motivation

అక్కడ మందు బాబులకు శుభవార్త కొత్తగా 27 రకాల బీర్లు

కొత్త‌గా ఐదు కంపెనీలకు కాంగ్రెస్‌ సర్కారు అనుమతి

వీటిలో క్రాఫ్ట్‌ బీర్లే అధికం

రాష్ట్రంలో బీర్ల‌ కొరతను అధిగమించేందుకే అన్న‌ ఎక్సైజ్‌శాఖ

Telangana beer brands with price Telangana beer brands list Beer price in Hyderabad Today Budweiser beer price in Telangana Telangana new brand beers

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణలో కొత్త‌గా 27 ర‌కాల బీర్లు రాబోతున్నాయి. దీనికోసం ఇప్ప‌టికే కొత్తగా ఐదు బీర్ల త‌యారీ కంపెనీలకు ఈ ఏడాది రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ అనుమతులు కూడా మంజూరు చేసింది. అయితే, వీటిలో అధికంగా క్రాఫ్ట్‌ బీర్లే ఉన్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ బేవరేజ్‌ కార్పొరేషన్‌ కొత్తగా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో టాయిట్‌ బ్రేవరీస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎక్సోటికా లిక్కర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, మౌంట్‌ ఎవరెస్ట్ లిమిటెడ్‌, లీలాసన్స్‌ ఆల్కా బేవ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌, సోం డిస్టిలరీస్‌ అండ్‌ బేవరేజెస్‌ ఉన్నాయి. 

ఇక ఎక్సైజ్‌శాఖ కొత్త‌గా అనుమతులు ఇచ్చిన కంపెనీల్లో ఒకటైన ‘లీలాసన్స్‌ ఆల్కా బెవ్‌’ సంగారెడ్డి జిల్లాలోని మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తుంది. ఇదే కంపెనీ ఏపీలో ‘ట్రెడిషనల్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ క్వాలిటీ’ అనే కంపెనీ పేరుతో బీర్లు విక్ర‌యిస్తోంది. అలాగే చెన్నైలో ‘సెయింట్‌ పాట్రిక్స్‌’ పేరుతో మద్యం బీర్లు రూపొందిస్తోంది. కాగా, ఈ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన‌ది. ‘అమెరికన్‌ బ్రూవ్‌ క్రాఫ్ట్‌ లిమిటెడ్‌ (ప్రై)’తో ఈ కంపెనీ టైఅప్‌ అయినట్లుగా తెలుస్తోంది.

‘బ్లాక్‌ బస్టర్‌’ పేరుతో నాలుగు ఫ్లేవర్లలో బీర్లను ఈ సంస్థ తయారు చేస్తోంది. కాగా తెలంగాణలో మాత్రం రెండు బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. అలాగే ఎక్సోటికా లిక్కర్‌ ప్రై. లి. కంపెనీ కూడా సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో బీర్లను తయారు చేస్తున్నట్లు దరఖాస్తు చేసుకుంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఉన్న బీర్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా బీర్ల కంపెనీల‌కు అనుమతులు ఇచ్చామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ వెల్ల‌డించింది.

Comments

-Advertisement-