రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మళ్లీ కోవిడ్ వేవ్ వారంలో 25 వేల కేసులు నమోదు..

covid-19 vaccine COVID certificate covid-19 gov in covid-19 registration causes of covid-19 covid-19 download COVID-19 symptoms Covid cases today news
Peoples Motivation

మళ్లీ కోవిడ్ వేవ్ వారంలో 25 వేల కేసులు నమోదు..

covid-19 vaccine COVID certificate covid-19 gov in covid-19 registration causes of covid-19 covid-19 download COVID-19 symptoms Covid cases today news

సింగపూర్ లో కోవిడ్-19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుం చి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్ ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్ యెకుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. 'దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి' అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అం తకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు.

Comments

-Advertisement-