రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రూ.25.50 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్..# TG 09 9999

RTO fancy number booking Telangana TS number plate which state TS Transport Registration number search Telangana fancy number TS number plate list RTO
Peoples Motivation

రూ.25.50 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్..# TG 09 9999 

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో కొత్త సిరీస్ ప్రారంభం

ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఒకే రోజు రవాణా శాఖకు రూ.43,70,284 ఆదాయం

TG 09 9999 వేలంలో భారీ ధరకు దక్కించుకున్న సోనీ ట్రాన్స్‌పోర్ట్ సొల్యూషన్స్

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైంది. వాహన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లక్కీ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. వీటిని దక్కించుకునేందుకు వాహన యజమానులు పెద్ద మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతూ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన వేలంలో టీజీ09 9999 ఫ్యాన్సీ నంబర్ ఏకంగా రూ.25,50,002లకు అమ్ముడుపోయింది. సోనీ ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ దీనిని దక్కించుకుంది. తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం ఈ భారీ మొత్తాన్ని వెచ్చించింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వాహన ఫ్యాన్సీ నంబర్‌ ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి.

 

RTO fancy number booking Telangana TS number plate which state TS Transport Registration number search Telangana fancy number TS number plate list RTO

ఈ సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబర్‌తో పాటు మరికొన్ని ఫ్యాన్సీ నంబర్లను వేలం వేశారు. దీంతో తెలంగాణ ఆర్టీఏకి ఒకే రోజు ఏకంగా రూ.43,70,284 రాబడి వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Comments

-Advertisement-