మే 23 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల
మే 23 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్.. షెడ్యూల్ విడుదల
సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి వెల్లడి
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్-2024 ప్రవేశాల ప్రక్రియను ఈనెల 23 నుంచి ప్రారంభించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళగిరిలోని సాంకేతిక విద్యా శాఖ కార్యాలయంలో మంగళవారం పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ.. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియకు ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు పది రోజుల పాటు అవకాశం కల్పిస్తామన్నారు. 27 నుంచి జూన్ 3 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 31 నుంచి జూన్ 5 వరకు ఆప్షన్ల నమోదు, జూన్ 5న ఆప్షన్లు మార్పు చేసుకోవచ్చునన్నారు. జూన్ 7న తుది సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని వివరించారు. జూన్ 10 నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని, సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 14లోగా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు. విద్యార్థులు అన్ని ధ్రువపత్రాలతో ప్రవేశాల కౌన్సెలింగ్ కు సిద్ధం గా ఉండాలని కోరారు. సమావేశంలో సాంకేతిక విద్య శాఖ జేడీ వెలగా పద్మారావు, అదనపు కార్యదర్శి ప్రసాద్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి రమణబాబు పాల్గొన్నారు. ఈ ఏడాది పాలిసెట్ కు 1,42,035 మంది విద్యార్థులు హాజరుకాగా 1,24,430 (87.61 శాతం) అర్హత సాధించారన్నారు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి