ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ - 2022 ను వెంటనే రద్దు చేయాలి
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ - 2022 ను వెంటనే రద్దు చేయాలి
జగన్ ప్రభుత్వంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు..
-జిల్లా కలెక్టర్ కు బైరెడ్డి శబరి వినతి
నంద్యాల, మే 07 (పీపుల్స్ మోటివేషన్):-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ -2022 (ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం) తో ప్రజల ఆస్తులకు జగన్ ప్రభుత్వంలో రక్షణ కరువైందని, ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నంద్యాల టీడీపీ లోక్ సభ అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు.
మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్. కె. శ్రీనివాసులుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ -2022 ను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా శబరి మాట్లాడుతూ.. ఈ చట్టం వల్ల అతి సులువుగా ప్రజల ఆస్తులను అన్యాక్రాంతం కావచ్చన్న భయం నెలకొందన్నారు.
టైట్లింగ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ ఆఫీలేట్ ఆథారాటి నియామాక సూత్రాలు, వివాదాల రిజిస్ట్రేషన్ నిర్వాహణ, యాజమాన్య హక్కుల వివాధాల పరిష్కారంలో సివిల్ కోర్టుల పాత్ర పూర్తిగా తొలగించడం, రిజిస్ట్రేషన్ కు సంబందించిన ఒరిజినల్ పత్రాలను అందించకపోవడం, హైకోర్టులోనే అంతిమ పరిష్కారం చూపిన మార్గం రాష్ట్రంలోని సామాన్య రైతుకి ఈ చట్టం వల్ల న్యాయం దూరంకానుందని బైరెడ్డి శబరి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల ఆస్తులు అన్యాక్రాంతమైనప్పుడు నేరుగా న్యాయస్థానంకు బాధితుడు వెళ్ళడానికి అవకాశం ఈ చట్టంలో లేదని, బాధితులు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని ఈ చట్టం చెబుతోందని ఆమె వివరించారు.
ఇలాంటి నల్ల చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేయాలా అని ఆమె ప్రశ్నించారు. ప్రజల ఆస్తులకు రక్షణ కావాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఈ నల్ల చట్టం రద్దు చేస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారన్నారు.