జూన్ 18 నుంచి ఆన్లైన్ లో డిగ్రీ ప్రవేశాలు
OAMDC Degree Admission 2024
AP Degree Online Admission 2024
Degree Admission 2024 in AP
Degree Admission 2024 in AP last date
OAMDC REGISTRATION
NEWS
By
Peoples Motivation
జూన్ 18 నుంచి ఆన్లైన్ లో డిగ్రీ ప్రవేశాలు
అమరావతి, మే 29 (పీపుల్స్ మోటివేషన్):-
ఎట్టకేలకు ఇంటర్మీడియట్ ఫలితాలు తర్వాత దాదాపు రెండు నెలల తర్వాత డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కౌన్సెలింగ్ ను జూన్ 18 నుంచి 29 వరకు నిర్వ హించాలని ఉన్నత విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతి ఉంటేనే బీసీఏ, బీబీఏ కోర్సులను కౌన్సెలింగ్లో పెట్టనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా కౌన్సెలింగ్ చేపట్టాలని భావిస్తోంది. ఈ లోపు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు, ఇతరత్రా ఫీజులు, అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలల అనుమతుల పొడిగింపు ఫీజును చెల్లించాలని కాలేజీలకు వర్సిటీలు ఆదేశాలు జారీ చేశాయి.
Comments