రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో భారీ పేలుడు... 17 మందికి పైగా మృతి

Blast at explosives factory in chattisgarh Bemetara Latest crime news Road accident news Breaking news Telugu daily news epaper today Telugu daily new
Peoples Motivation

పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో భారీ పేలుడు... 17 మందికి పైగా మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలోని పిర్దా గ్రామ సమీపంలో పేలుడు

ఘటనా స్థలికి పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్

గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలింపు

Blast at explosives factory in chattisgarh Bemetara Latest crime news Road accident news Breaking news Telugu daily news epaper today Telugu daily new

ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరా జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది నుంచి 17 మంది వరకు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పిర్దా గ్రామ సమీపంలోని బెర్లా డెవలప్‌మెంట్ బ్లాక్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి పోలీసులు, వైద్య సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

-Advertisement-