రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం... వాహనం బోల్తాపడి 17 మంది మృతి

Crime News Chattisgarh 17 coolies died Road accident 17 death Latest crime News Road accident in chattisgarh karidham district Latest political News
Peoples Motivation

ఘోర రోడ్డు ప్రమాదం... వాహనం బోల్తాపడి 17 మంది మృతి

బీడీ ఆకుల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం

కబీర్‌ధామ్ జిల్లాలో లోయలో పడిన వాహనం

మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లు గుర్తింపు

 

Crime News Chattisgarh 17 coolies died Road accident 17 death Latest crime News Road accident in chattisgarh karidham district Latest political News

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కవర్దా ప్రాంతంలో వాహనం బోల్తాపడి 17 మంది మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. కబీర్‌ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బైగా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని తిరిగి ఎక్కించుకొని వాహనం వెనక్కి తీసుకువస్తోంది. ఈ సమయంలో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.

Comments

-Advertisement-