-Advertisement-

సెల్ ఫోన్ విషయంలో గొడవపడి సొంత అన్నను కడతేర్చిన 14 ఏళ్ల బాలిక

14 years Girl kills brother mobile phone Crime News Latest Crime News Latest Breaking news Latest short news updates Latest news headlines Political N
Peoples Motivation

సెల్ ఫోన్ విషయంలో గొడవపడి సొంత అన్నను కడతేర్చిన 14 ఏళ్ల బాలిక

ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ

ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడొద్దంటూ చెల్లెలికి అన్న మందలింపు

కోపంతో నిద్రిస్తున్న అన్నపై గొడ్డలితో వేటువేసి హత్య

పోలీసుల దర్యాప్తులో నేరాన్ని అంగీకరించిన బాలిక 

14 years Girl kills brother mobile phone Crime News Latest Crime News Latest Breaking news Latest short news updates Latest news headlines Political N
14 ఏళ్ల బాలిక సెల్ ఫోన్ విషయంలో సొంత అన్ననే కడ తీర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నపై కోపం పెంచుకున్న ఓ 14 ఏళ్ల బాలిక అతడు నిద్రలో ఉండగా గొడ్డలితో నరికి చంపేసింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కేసీజీ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఇతర కుటుంబసభ్యులు ఇంట్లో లేని సమయంలో అన్నాచెల్లెళ్ల మధ్య గొడవ మొదలైంది. నిత్యం మొబైల్ ఫోన్లో ఇతర కుర్రాళ్లతో మాట్లాడుతున్న చెల్లెల్ని అన్న మందలించాడు. సెల్‌ఫోన్ వినియోగం తగ్గించాలని కోపడ్డాడు. దీంతో బాలిక తీవ్ర ఆగ్రహానికి లోనైంది. అతడు పడుకున్న సమయంలో గొడ్డలితో గొంతు నరికి చంపేసింది. ఆ తరువాత రక్తం మరకలు తొలగించుకునేందుకు స్నానం చేసి వచ్చిన ఆమె ఆ తరువాత ఇరుగుపొరుగుకు తన అన్నను ఎవరో హత్య చేశారని చెప్పింది. అయితే, పోలీసుల విచారణ సందర్భంగా బాలిక చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది.

Comments

-Advertisement-