-Advertisement-

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) 4,660 నోటిఫికేషన్ విడుదల

rpf recruitment 2024 rpf constable rpf. gov. in rpf full form rpf notification rpf apply online rpf salary rpf recruitment 2024 out, RPF NOTIFICATION
Peoples Motivation

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) 4,660 నోటిఫికేషన్ విడుదల 

RPF NOTIFICATION 2024 OUT
దేశవ్యాప్తంగా పలు రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అందులో భాగంగా మరో రైల్వే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాల్లోకి వెళితే...తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింక్పై క్లిక్ చేసి ఏప్రిల్ 15 నుంచి మే 14వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాలు 

మొత్తం పోస్టులు 4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్, 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు

కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18- 28 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.

ఎంపిక ప్రక్రియ

ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు 

ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్మెన్/ మహిళలు/ ట్రాన్సెండర్/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్ చేస్తారు.

వేతనం

ఎస్సై పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు.

జోన్ల వారీగా ఆయా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల సంఖ్య, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇంకా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Comments

-Advertisement-