Breaking News #ఘోర అగ్ని ప్రమాదం... రియాక్టర్ పేలి ప్లాంట్ మేనేజర్ సహా ఏడుగురి మృతి...25 మందికి తీవ్ర గాయాలు
Breaking News #ఘోర అగ్ని ప్రమాదం... రియాక్టర్ పేలి ప్లాంట్ మేనేజర్ సహా ఏడుగురి మృతి...25 మందికి తీవ్ర గాయాలు
సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ప్రమాదం
ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు
ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
సంగారెడ్డి, ఏప్రిల్ 03 (పీపుల్స్ మోటివేషన్):-
సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్లాంట్ మేనేజర్ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో రియాక్టర్ పేలిన తాకిడికి కూలిన నిర్మాణాలు. భయ భ్రాంతులు గురైన గ్రామ వాసులు. పరిశ్రమ లో నీ మరో రియాక్టర్ పెలే అవకాశం. అది పేలితే మూడు కిలమీటర్ల మేర ప్రభావం చూపుతుందంటున్న అధికారులు. పరిశ్రమ పరిసరాల నుండి ప్రజలను ఖాళీ చేయిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.