అభివృద్ధి ప్రదాతకు అడుగడుగునా హారతులు
అభివృద్ధి ప్రదాతకు అడుగడుగునా హారతులు
మంత్రి బుగ్గనకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
శాలువాలు, గజమాలలతో ఘనంగా సత్కరించిన పురప్రజలు
బేతంచర్ల, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బేతంచెర్ల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పట్టణంలోని మంత్రి బుగ్గన కార్యాలయం నుంచి కాలినడకన ప్రచారం మొదలు పెట్టారు. మొదటగా అంగళ్ల బజార్ మీదుగా ప్రచారం చేస్తూ అమ్మవారిశాల సమీపంలో ఆంజనేయస్వామిని, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గాలను కూడా సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బీఆర్ పేటలోని పరిశుద్ధ మార్కు చర్చిలో మంత్రి బుగ్గన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దుర్గాపేటలో ప్రజలు ప్రచారంలో పూల మాలలతో మంత్రి బుగ్గనకు జేజేలు చెబుతూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మళ్లీ బుగ్గనే రావాలంటూ హారతులిచ్చి..విజయ తిలకం దిద్దారు. ముఖద్వారం ఊరు వాకిలి చుట్టు పక్కల కాలనీలు అనంతరం పుల్లమ్మ కల్లం ప్రాంతంలోని ఓ టీ స్టాల్ వద్ద ఆగి టీ తాగారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ దుర్గాపేటలో ఓ వృద్ధురాలు మంత్రి బుగ్గనను ఆప్యాయంగా పలకరించారు.ఠంఛన్ గా పింఛన్ లు ఇచ్చి వృద్ధులకు ఎంతో సేవ చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతపూర్వకంగా ఆశీర్వదించాలని కోరారు. ఎన్నో కలలను నెరవేర్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీనగర్ కాలనీ, రిజిస్టర్ ఆఫీస్, కొత్త బస్టాండు, బైటీ పేట గౌరుపేట కాలనీలలో పర్యటిస్తున్న ఆయనకు అడుగడుగునా మహిళలు హారతులు పట్టారు. అభివృద్ధి ప్రదాతకు హ్యాట్రిక్ విజయం ఖాయమంటూ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానం చేశారు. జై బుగ్గన అంటూ యువత నినాదాలు చేశారు. ఆటో వెనుక భాగంలో అమర్చిన మంత్రి బుగ్గన చిత్రపటానికి బోయపేట ప్రజలు రెండు నిండు బిందెలతో పాలాభిషేకం చేసి తమ ప్రేమాభిమానాలను చాటారు. అనంతరం మంత్రి బుగ్గనకు క్రేన్ సహాయంతో తీసుకువచ్చిన భారీ గజమాలతో సత్కరించారు. అనంతరం హ్యాండ్ హెల్డ్ స్పార్కల్ పైరో గన్ ను గాలిలోకి గురి పెట్టి కాల్పులు జరపడంతో యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టి ఈలలు వేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మున్సిపల్ ఛైర్మన్ చలం రెడ్డి, వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి,మృతుజ వలి, కాజా, మద్దిలేటి స్వామి ఆలయ చైర్మన్ సీతారామచంద్రుడు, గుని నాగరాజ్, దస్తగిరి, పిట్టల జాకీర్ హుస్సేన్, ఇతర మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ ప్రజలు మంత్రి ఎన్నికల ప్రచారానికి భారీగా ప్రజలు నాయుకులు పాల్గొన్నారు.