కేసీఆర్ వ్యహరిస్తున్న తీరు విడ్డురంగా ఉంది: కొడాలి రవికుమార్
కేసీఆర్ వ్యహరిస్తున్న తీరు విడ్డురంగా ఉంది
అధికారం కోల్పోయి బిఆర్ఎస్ పార్టీ ఖాళీ...
అసహనంతో మాట్లాడుతున్న కేసీఆర్...
చంద్రబాబు పై కేసీఆర్ విమర్శించడం తగదు...
-తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రవికుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 07 (పీపుల్స్ మోటివేషన్):-
కెసిఆర్ దుర్మార్గమైన పది సంవత్సరాల పాలన మూర్ఖంగా చేసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు . కరీంనగర్ లో చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిడిపి నేత కొడాలి రవికుమార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యహరిస్తున్న తీరు విడ్డురంగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రవికుమార్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ప్రెస్ మీట్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని దుర్మార్గుడు మూర్ఖుడు అని దూషించడం పట్ల ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అసహనంతో ఆక్రోషంతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నరాని విమర్శించారు. దేశంలో కెల్లా పెద్ద మూర్ఖుడు కెసిఆర్ అని. తెలంగాణలో 10 సంవత్సరాలు దుర్మార్గమైన దరిద్రపు పాలనా చేసినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన కెసిఆర్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులు. రైతులు. నిరుద్యోగ యువత అనేక మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతే. ఒక్క సారైనా కెసిఆర్ పరామర్శించారా అని ప్రశ్నించారు. 20 సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో చేనేత కార్మికులు చనిపోతే పట్టించు కోలేదని కెసిఆర్ అసత్య ఆరోపణలు చేయడం విడ్డురం గా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సారిగా సహకార సంఘాలకు సంభంధం లేని చేనేత కార్మికులను ప్రోత్సాహించే ఉద్దేశంతో వారిని 'దీన్ దయాల్ హత్ కర్ఘ ప్రోత్సాహం 'పథకం చేపట్టారు.
ఎక్సైజ్ సుంకం విధించని దారాన్ని చేనేత కార్మికులకు సరఫరా చేసారు. చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి వీలుగా నేతబజార్లను జిల్లాలలో ఏర్పాటు చేసారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కరెంటు యూనిట్ రేటును 1.74 పైసల నుంచి 0.87 పైసలకు తగ్గించింది. మరమగ్గాలా ఆధునీకరణకు ఒక్కో మరమగ్గానికి Rs.20,000 ఇవ్వడం జరిగింది. గ్రూప్ ఇన్సూరెన్సు పధకాన్ని అమలు చేసారు. భారత దేశంలో పునరవ్యవస్తీకరించిన మొట్టమొదటి చేనేత సహకార సంస్థ 'ఆప్కో'. దీనివల్ల ఆప్కో అమ్మకాలు 50% పెరిగాయి. చేనేత సహకార సంఘం లో ఉన్న వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆనాడు నేత కార్మికులను చంద్రబాబు ఆదుకున్నాడు. బిఆర్ఎస్ ప్రభుత్వం లో చేనేతకి ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బతుకమ్మ చీరల పని కార్మికులకు ఇచ్చామని చెప్పి కోట్ల రూపాయలు బిఆర్ఎస్ నాయకులు దోచుకుతున్నారు. నేత కార్మికులతో పని చేయించుకుని అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు డబ్బులు ఇవ్వలేదని ఇప్పుడు తమ అసమర్థతను కప్పించుకోవడం కోసం ఇతర పార్టీల మీద విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిన విధంగానే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పడం ఖాయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొడాలి రవికుమార్