నాసిరకం విత్తనాల ముఠా లీడర్ ఎంపీ పోచా అని రైతులే అంటున్నారు..
నాసిరకం విత్తనాల ముఠా లీడర్ ఎంపీ పోచా అని రైతులే అంటున్నారు..
రైతులే తూ.. నీ బతుకుచెడా అంటున్నా ఛిగ్గులేదా పోచా
మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
నంద్యాల, ఏప్రిల్ 25 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పార్లమెంట్ పరిధిలో మీ ఎంపీ పోచా ఎలాంటోడు అని ఎవరైన అడిగితే తూ.. నీ బతుకు చెడా అంటూ నాసిరకం విత్తనాల ముఠా లీడర్ అని రైతులే అంటున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్. బైరెడ్డి శబరి ఎన్నికల కార్యాలయంలో గురువారం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి బాధిత రైతుల సమక్షంలో విలేకరులతో బైరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో పోచా బ్రహ్మనందరెడ్డి నాసిరకం విత్తనాలు రైతులకు అంటగట్టి తీవ్రంగా నష్టపుచ్చుతే భాదితులకు న్యాయం చేసేందుకు పంచాయతీ తానే చేసి పోచా తో రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చేసానన్నారు.
సొంత మండలం ఉయ్యాలవాడ, నీకు పరిశ్రమలు ఉన్న నంద్యాల మండలం చాబోలు, దొర్నిపాడు మండలం చాకరాజువేముల తదితర గ్రామాల నీ భాధిత రైతులతో ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టానని, కనీసం ఆ రైతుల గోడు వినయ్య పోచా అంటూ బైరెడ్డి బాధితులతో వారి ఆవేదనను వినిపించారు. ఇలాంటి ఎంపీ మాకు ఒద్దు పోచాకు ఓట్లు వేయవద్దని నీ భాధిత రైతులే తోటి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నా ఇంకా నీలో మార్పు లేదేమయ్య అన్నారు. నీకు వ్యసాయం శాస్రవేత్తగా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన, పాలకమండలి పదవి ఇచ్చి గౌరవం కల్పించిన నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని సర్వనాశనం చేసేందుకు నీకు మనస్సు ఎలా వచ్చింది పోచా బ్రహ్మానందరెడ్డి అని బైరెడ్డి అన్నారు.
110 ఏళ్ల సుధీర్గ కాలం నంద్యాలకే కాకుండా దేశ, విదేశాలలో నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఇటు రైతు లకు, అటు దేశానికే సేవ చేస్తున్న నంద్యాల ఆర్ఎఆర్ఎస్ (RARS) ను కక్షగట్టి శాస్రవేత్తల పరిశోధన ఫలితాలు రైతులకు దక్కకుండా చేసిన ఘనత ఎంపీ పోచా కే దక్కుతుందని బైరెడ్డి అన్నారు.
ఎంపీ పదవి నీ సొంత ఆస్తులు పెంచుకునేందుకు ఉపయోగపడిందిగాని నంద్యాల పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి పాటు పడలేదని ఆరోపించారు. రైతులను మోసం చేసినోడు ఎప్పటికి బాగుపడలేదని, దేశానికి అన్నం పెట్టె రైతుకడుపు పొట్టవద్దని బైరెడ్డి హితవు పలికారు.
రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా జీవో 365 తెచ్చిన జగన్ ను ఎందుకు నిలధీయలేదని, పార్లమెంట్లో నంద్యాల అభివృద్ధి కోసం ప్రశ్నించావా అని నిలదీశారు. నీ ఆసుపత్రి కి అడ్డు ఉన్నాయని బొగ్గులైన్ నిరుపేదల గుడిసెలు తీయించావ్, ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యంతో నువ్వు మెడికల్ కళాశాల కొట్టేయాలని చూస్తే వైసీపీ రైతు లే ఆర్ఎఆర్ఎస్(RARS) భూములు కాపాడాలని హైకోర్టును ఆశ్రయిస్తే మీ అధికార బలంతో ఆర్ఎఆర్ఎస్ భూములు లాక్కున్నారు, అయితే హై కోర్టు కు రైతులు వెళ్లడంతో ప్రయివేట్ లేకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీ కేంద్రం మంజూరు చేసిందని బైరెడ్డి గుర్తు చేశారు.
అధికార బలంతో నోటికోచ్చినట్లు మాట్లాడితే ప్రజలు గుణపాఠం చెబుతారని ఎంపీ పోచాను బైరెడ్డి హెచ్చరించారు.