-Advertisement-

బ్యాండ్ ఎయిడ్‌తో క్యాన్సర్.. బ్యాండేజీల్లో పీఎఫ్ఏఎస్ రసాయనం..

health news india world health news today good health news interesting health articles health news hindi public health news health news in Telugu pdf
Peoples Motivation

బ్యాండ్ ఎయిడ్‌తో క్యాన్సర్.. బ్యాండేజీల్లో పీఎఫ్ఏఎస్ రసాయనం..

గాయాలపై అతికించినప్పుడు ఇది నెమ్మదిగా శరీరంలోకి చేరిక...

కరిగిపోకుండా ఏళ్లపాటు అలానే...

రోగ నిరోధక శక్తిని దెబ్బతీయడం, టీకా ఫలితాలను తగ్గింస్తున్న పీఎఫ్ఏఎస్ రసాయనం

‘మమవేషన్’ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి

Band aid cancer issues news
శరీరంపై ఏవైనా గాయాలు అయినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ‘బ్యాండ్ ఎయిడ్’. ఏ చిన్న గాయమైనా వెంటనే దానిని పైన అతికించేస్తారు. అయితే, ఇలా చేయడం ఏమంత మంచిది కాదని, ఇది క్యాన్సర్ కారకమంటూ తాజా అధ్యయనం ఒకటి షాకింగ్ విషయాలు వెల్లడించింది. పీఎఫ్ఏఎస్‌గా పిలిచే పాలీ ఫ్లూరో ఆల్కైల్ సబ్‌స్టాన్సెస్‌ను బ్యాండ్ ఎయిడ్‌లో గుర్తించినట్టు కన్జుమర్ వాచ్‌డాగ్ ‘మమవేషన్’ పేర్కొంది.

వాతావరణంలో కరగని పీఎఫ్ఏఎస్‌ వంటి రసాయనాలతో ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నట్టు తెలిపింది. ఈ రసాయనాలు కలిగిన బ్యాండేజీలను గాయాలపై అతికించినప్పుడు అవి మెల్లగా శరీరంలో చేరి కరిగిపోకుండా ఏళ్లపాటు అలానే ఉంటాయని తెలిపింది. తద్వారా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని వివరించింది.

పీఎఫ్ఏఎస్‌ రసాయనాలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు, టీకాల ఫలితాలను కూడా తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. 

బాలల గ్రహణశక్తి, శారీరక, మానసిక వికాశంపైనా ప్రభావం చూపిస్తాయని తెలిపారు. హార్మోనల్ సమస్యలతోపాటు కొన్ని రకాల కేన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉందని వివరించారు. పీఎఫ్ఏఎస్ రసాయనాలకు వాటర్‌ప్రూఫ్ లక్షణాలు ఉండడం, వేడి, గ్రీజు, ఆయిల్, నీరు వంటి వాటిని తట్టుకునే శక్తి ఉండడంతో వీటిని బ్యాండేజ్‌లలో వాడతారు. అడెహెసివ్స్‌, నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌, ఫుడ్‌ ప్యాకేజింగ్‌లలోనూ ఈ రసాయనాలు కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 18 బ్రాండ్లకు చెందిన 40 బ్యాండేజీలను పరిశీలించగా వాటిలో 26 బ్యాాండేజీల్లో ఈ రసాయనాలు కనిపించిట్టు అధ్యయనం పేర్కొంది. 

Comments

-Advertisement-