ఐదు సంవత్సరాలకు ఒకసారి...ఐదు నిమిషాలు కేటాయించలేమా..!
ఐదు సంవత్సరాలకు ఒకసారి...ఐదు నిమిషాలు కేటాయించలేమా..!
దేశం కోసం ఐదు నిమిషాల కేటాయించడం సాధ్యమే కదా!
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది..
వేలిపై వేసే సిరా.. దేశంపై మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది
'నా ఓటు... నా గళం' కార్యక్రమం లో సిజెఐ డి.వై.చంద్రచూడ్
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కుపై ప్రజల్లో చైతన్యం కలిగిం చడానికి ఎన్నికల సంఘం చేపట్టిన 'నా ఓటు... నా గళం' కార్యక్రమంలో భాగంగా ఆయన వీడియో సందేశం పంపించారు. 'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరు లైన మనకు రాజ్యాంగం అనేక హక్కులు కల్పించింది. ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదేళ్లకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడం సాధ్యమే కదా! ఓటు హక్కును వదులు కోవద్దని ప్రతి ఒక్క రినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం' అని జస్టిస్ చంద్రచూడ్ ఆ సందేశంలో పేర్కొన్నారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనం దాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో వేలిపై వేసే సిరా.. దేశంపై మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుందన్నారు.