వైసీపీకి భారీ షాక్...వైసీపీ జనరల్ సెక్రటరీ టిడిపిలో చేరిక
వైసీపీకి భారీ షాక్...వైసీపీ జనరల్ సెక్రటరీ టిడిపిలో చేరిక
వైసీపీకి నంద్యాలలో ఎదురుగాలులు
నంద్యాలలో చతికిల పడ్డ వైసీపీ.. పుంజుకున్న టీడీపీ
వైసీపీకి పతనం తప్పదు అంటున్న నంద్యాల ప్రజలు
నంద్యాల, ఏప్రిల్ 20 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రెటరీ కొండబోయిన శ్రీనివాసులు యాదవ్ (కొండ శీను), పేడ నారాయణ, సుబ్బయ్య, చిన్న నారాయణ, అల్లూరయ్య, రాముడు, పరమేష్ తో పాటు 145 కుటుంబాలు మాజీ మంత్రివర్యులు నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర కార్యదర్శులు తులసి రెడ్డి, ఏవిఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో టిడిపిలో చేరిక వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఫరూక్ ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ... నంద్యాలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైసీపీని చీకొట్టి టిడిపిలో చేరుతున్నారన్నారు వైసిపి ప్రభుత్వం నాయకులని కార్యకర్తలను విస్మరించిందని వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు కాబట్టి వారి ఆత్మ అభిమానం చంపుకొని వైసీపీలో పని చేయలేక వారు టిడిపిలో చేరుతున్నారన్నారు. టిడిపిలో చేరిన వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని టిడిపిలో వారికి సూముచిత స్థానం కల్పించి ప్రజలకు మంచి పరిపాలన అందించి నంద్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆచరణలో లేని పథకాలన్నీ పెట్టి అవి చేయలేక జగన్ చేతులెత్తేసారన్నారు . ప్రజలు వీటన్నిటిని గమనిస్తున్నారని 2024 మే 13 జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫరూక్ కి , నంద్యాల ఎంపిక పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి కి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శివ శంకర్ యాదవ్, అజ్మీర్ టిడిపి నాయకులు పాల్గొన్నారు.