రోజురోజుకు ప్రజల లో నమ్మకం కోల్పోతున్న టిడిపి నాయకులు...
రోజురోజుకు ప్రజల లో నమ్మకం కోల్పోతున్న టిడిపి నాయకులు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలుపుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులు
7వ వార్డు నుండి టీడీపీ సీనియర్ నేత మస్తాన్ బాబ మరియు 100 కుంబాలు వైసీపీలో చేరిక
నంద్యాల, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పట్టణం 7వ వార్డు ఫారుక్ నగర్ నుండి సీనియర్ టీడీపీ నాయకుడు మస్తాన్ బాబ మరియు వారికి సంబందించిన 100 కుటుంబాలు ఆదివారం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డా. నౌమాన్, కౌన్సిలర్ కలాం, మాజీ కౌన్సిలర్ నబి రసూల్, సాధిక్, ఆద్వర్యంలో టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. అందరు సమయస్ఫూర్తిగా ఉంటూ ఒక లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ విజయానికి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అత్యధిక మెజారీటీ అందించేందుకు కృషిచేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ...నంద్యాల ఓల్డ్ టౌన్కు సంబంధించిన 12 వార్డులో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వచ్చేందుకు కృషిచేయాలని కోరారు. నేడు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీలోకి వచ్చిన మస్తాన్ బాబకు శిల్పా కుటుంబం గురించి తెలుసని, రాజకీయంగా అనేక సంవత్సరాలు ఉంటూ సేవకార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారన్నారు. ప్రధానంగా కరోనా కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలను అందించారని తెలిపారు. నంద్యాలలో ముస్లింలకు రోజా కుంట వద్ద షాదీఖానా, సాయిబాబనగర్ వద్ద షాధీఖానా, ఎన్టీఆర్ షాదీఖాన పక్క ఉర్దూ స్కూల్ ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. ఉర్దూ కళాశాల నిర్మాణానికి 15కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను నెట్టామన్నారు. రాష్ట్రంలో జగనన్న సీఎం కావాలంటే నంద్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోదా బ్రహ్మానందరెడ్డి విజయానికి ప్రతి ఒక్కడు కృపివేయాలని కోరారు. కార్యక్రమంలో నబీరసూల్, రసూల్ అజార్, పార్టీలో చేరిన వారు జుబీర్, నలీరమాల్, సోహెల్, ఫారుక్, చాంద్ బాష, తదితరులు పాల్గొన్నారు.