వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువు
వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువు
-నంద్యాల టీడీపీ MP అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి
నంద్యాల, ఏప్రిల్ 23 (పీపుల్స్ మోటివేషన్):-
గడివేముల మండలం దుర్వేసి గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇంటికి వెళుతున్న దళిత టీడీపీ నాయకులు పెరుమాళ్ళ చంద్రశేఖర్ పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పి సాయికుమార్ రెడ్డి దాడి చేసి తీవ్రంగా కొట్టడం అన్యాయం అని నంద్యాల టీడీపీ MP అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న పెరుమాళ్ళ చంద్రశేఖర్ ను బైరెడ్డి శబరి పరమార్శించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందన్నారు. కరోనా సమయంలో మాస్క్ లు అడిగినందుకు దళిత డాక్టర్ ను వైసీపీ ప్రభుత్వం వేధించి కొట్టిచంపారని, వైసీపీ ఎం ఎల్ సి అక్రమాలు బయటపెడతాడన్న భయంతో దళిత కారు డ్రైవర్ ను చంపి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. జగన్ ప్రభుత్వం అక్రమాలు ప్రశ్నించిన దళిత యువకుడిని పోలీస్ స్టేషన్ లోనే చిత్రహింసలు పెట్టి శిరోముండనం చేసిన చరిత్ర జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
వెంటనే దళిత చంద్రశేఖర్ పై దాడి చేసిన సాయికుమార్ రెడ్డి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గడివేముల ఎస్ ఐ ని నంద్యాల టీడీపీ MP అభ్యర్థి Dr. బైరెడ్డి శబరి డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.