అదే సమస్యలు... అవే బాధలు!! శిల్పా పాలనలో కష్టాలు, కన్నీళ్లే !!
latest news telugu,
breaking news in india, today latest news in telugu,
latest news today,
latest news live
5 latest news headlines
latest news world
By
Peoples Motivation
అదే సమస్యలు... అవే బాధలు!!
శిల్పా పాలనలో కష్టాలు, కన్నీళ్లే !!
నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఖలీల్
నంద్యాల, ఏప్రిల్ 24 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల నియోజకవర్గంలో ఏ వార్డులో చూసిన ఏ గ్రామంలో చూసినా అదే సమస్యలు.. అవే బాధలు ప్రజలను వెంటాడుతున్నాయని నంద్యాల టౌన్ 13వ వార్డు నాయకులు మాజీ కౌన్సిలర్ మధు సాయి ఆధ్వర్యంలో టేక్కే మరియు టేక్కే మార్కెట్ యార్డ్ ఎదురుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నంద్యాల తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఖలీల్ విమర్శించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్, ఎన్ ఎండి ఖలీల్ మాట్లాడుతూ.. 20 ఏళ్లు శిల్పా కుటుంబ పాలనలో నియోజకవర్గంలో సమస్యలు తిష్ట వేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పర్యటించినా డ్రైనేజీ, కాలువలు, స్మశాన వాటికలు, విద్యుత్ దీపాలు, రేషన్, ఫించన్లు, ఇంటి పట్టాలు, తాగునీరు సమస్యలు పై ప్రజలు ఏకరువు పెడుతున్నారని అన్నారు. మరో పక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారని వెల్లడించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, మైనింగ్, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో శిల్పా కుటుంబాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎలాంటి అవినీతి మచ్చ లేని నంద్యాల టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్ఎండి ఫరూక్ ని , నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైరెడ్డి శబరి కి ఒక్క అవకాశం ఇద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాల వీరయ్య, చిలకల వెంకటేశ్వర్లు, అనుముల పుల్లయ్య, రాధాకృష్ణ, సుధాకర్, రామకృష్ణ, రమణ, హరినాథ్ చౌదరి జనసేన నాయకులు షబ్బీర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments