జన ప్రభంజనం మధ్యన ఉత్సాహంగా బుసినే విరుపాక్షి నామినేషన్ దాఖలు...
జన ప్రభంజనం మధ్యన ఉత్సాహంగా బుసినే విరుపాక్షి నామినేషన్ దాఖలు....
ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేత..
మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ పత్రాలు అందజేసిన విరుపాక్షి
ఆలూరు, ఏప్రిల్ 23 (పీపుల్స్ మోటివేషన్):-
బుసిని విరుపాక్షి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. అత్తిబెళగల్ అడ్డరోడ్డు నుండి బైక్ ర్యాలీ పార్టీ కార్యాలయం వరకు వైసీపీ జన ప్రభంజనం, ఉకలెత్తే ఉత్సాహంతో యువత కేరింతలు కొడుతూ పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఉదయం 12 గంటల పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం కార్యాలయం బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి బుసిని విరుపాక్షి మాట్లాడుతూ తన గెలుపుకు ప్రజా మద్దతు తోడవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజాభిమానం, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో నామినేషన్ తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. మీ ఉత్సాహం, అభిమానం వెలకట్టలేనిదన్నారు. మీ మద్దతుతో తాను విజయం సాధించబోతున్నానని విరుపాక్షి ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవారికి అందేలా తాను కృషి చేయడం జరిగిందన్నారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలు తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బి.వై. రామయ్య, వైకుంఠ మల్లికార్జున చౌదరి మసాలా పద్మజ కోట్ల హరిచక్రపాణి రెడ్డి తేర్నకల్ సురేందర్ రెడ్డి ఏరురు శేఖరు మారయ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.