పార్టీ విరాళాల కోసం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
పార్టీ విరాళాల కోసం వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు నాయుడు
విరాళాల కోసం tdpforandhra.com వెబ్ సైట్ తీసుకువచ్చిన టీడీపీ
పార్టీ మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు పిలుపు
విరాళాలకు రసీదు ఇవ్వనున్న టీడీపీ
తనవంతుగా రూ.99,999 విరాళం ఇచ్చిన చంద్రబాబు
మంగళగిరి, ఏప్రిల్ 09 (పీపుల్స్ మోటివేషన్):-
ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వెబ్ సైట్ ను ఆవిష్కరించిన చంద్రబాబు... తనవంతుగా రూ.99,999 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ అభిమానులు, మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని కోరారు.
ఇది ఎన్నికల సమయం కావడంతో ఏ పార్టీ కార్యకలాపాలు ముందుకు వెళ్లాలన్నా నిధులు కావాల్సిందే. ఈ క్రమంలో, తెలుగుదేశం పార్టీ విరాళాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను తీసుకువచ్చింది. ఈ వెబ్ సైట్ (https://tdpforandhra.com/)ను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రారంభించారు.
కాగా, విరాళాలు ఇచ్చిన వారికి రసీదు కూడా అందిస్తారు. ఈ వెబ్ సైట్లో రూ.99, రూ.999, రూ.9,999, రూ.19,999, రూ.99,999, ఇతర మొత్తాల కోసం ఆప్షన్లు ఇచ్చారు. 18 ఏళ్లకు పైబడిన వారి నుంచే విరాళాలు స్వీకరించనున్నారు. ఆ మేరకు వెబ్ సైట్లోనే ఆధార్ వెరిఫికేషన్ చేయనున్నారు.