ఆళ్లగడ్డలో భారీ షాక్ వైసీపీ నుండి టీడీపీలో చేరిక
ఆళ్లగడ్డలో భారీ షాక్ వైసీపీ నుండి టీడీపీలో చేరిక
వైసీపీ నుంచి 200 కుటుంబాలు పగడాల శ్రీనివాసులు రావు ఆధ్వర్యంలో టిడిపిలోకి భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ సమక్షంలో చేరిక...
కాపు బలిజల సంక్షేమం కృషి చేసిన చంద్రబాబు నాయుడుకే బలిజలు, ఇతర వర్గాల మద్దతు...
భూమా అఖిలప్రియ, బైరెడ్డి శబరి గెలుపుకు కృషి చేస్తాం: బలిజ నాయకులు పగడాల వెంకట కృష్ణయ్య, శ్రీనివాసులురావు
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలో వైఎస్ఆర్ సీపీకి భారీ షాక్ తగిలింది. దొర్నిపాడు మండలానికి చెందిన బలిజ వర్గీయులు, ఇతర గ్రామాలకు చెందిన టిడిపి అభిమానులు పగడాల శ్రీనివాసరావు, వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు 2500పైగా ఓటర్లు భూమా విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ నాయుడు సమక్షంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి అఖిలప్రియ మరియు నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి మద్దతుగా టిడిపిలో చేరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి రాచరిక , నియంతృత్వ వారసత్వ పాలనకు, దౌర్జన్యానికి, గుండాయిజానికి చరమగీతం పాడాలని, ప్రజా సంక్షేమం కోసం, కాపు బలిజల సంక్షేమం కోసం కృషి చేసిన చంద్రబాబు నాయుడుకి మా మద్దతు తెలుపుతున్నాం. కాపు రిజర్వేషన్లను అమలు చేయని వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాయలసీమ లోని బలిజలు సిద్ధంగా ఉన్నారు.కాపుల సంక్షేమం కోసం మంజునాథ కమిషన్ వేసి బిసిఎఫ్ జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటాలో అమలు చేస్తానన్న చంద్రబాబు నాయుడుకే మా మద్దతు ఉంటుంది. త్వరలోనే నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని కలిసి మా మద్దతును తెలుపుతూ నంద్యాల జిల్లాలో టిడిపి జెండాను ఎగరేస్తాం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దొర్నిపాడు మండలానికి సంబంధించిన పగడాల శ్రీనివాసరావు,పగడాల రామకృష్ణయ్య, ప్రతాప్, సతీష్ పృధ్విరాజు, నాగరాజు, భూపనపాటి శేఖర్ మరియు దొర్నిపాడు గ్రామానికి చెందిన జనసేన, టీడీపి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.