ఎల్లుండే పదవ తరగతి ఫలితాలు విడుదల
ఎల్లుండే పదవ తరగతి ఫలితాలు విడుదల
హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-
ఇక తెలంగాణ పదవ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చేతుల మీదగా పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఈ సారిగా పదో తరగతి మెమోలపై...PEN నెంబర్? అంటే ఏంటి?
దేశవ్యాప్తంగా తొలిసారిగా పదో తరగతి మెమోలపై పెన్ నెంబర్ను ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన 'పెన్' నెంబర్లను ముద్రించనుంది. పెన్ నెంబర్ సెక్యూరిటీ ఫీచర్లతో కలిగి ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. ఈ పెన్ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ సర్టిఫికెట్లను సింపుల్ గా గుర్తించే అవకాశం ఉంటుంది.
నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా కేటాయిస్తున్నారు. పెన్ అనేది ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయించనున్న ఒక విశిష్ట సంఖ్య. ఆ సంఖ్య వారి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం UDISE + పోర్టల్ ద్వారా విద్యార్థులందరికీ ఈ PEN (Permanent Education Number).
ఈ PEN ఎడ్యుకేషన్ ప్రారంభ సంవత్సరంలోనే ఇవ్వబడుతుంది. ఇది జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడీ తరహాలో PEN నంబర్ను కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఎక్కడ చదివారో.. ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సింపుల్గా తెలుసుకోవచ్చు.
ఫలితాల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి