ఆళ్లగడ్డలో పుంజుకుంటున్న భూమా మార్క్...
ఆళ్లగడ్డలో పుంజుకుంటున్న భూమా మార్క్...
ప్రజల మద్దతుతో ఎన్నికల్లో ముందుకెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిల ప్రియ....
భూమా కుటుంబానికి టిడిపి కంచుకోటగా మారిన ఆళ్లగడ్డ
గత కొన్ని ఏళ్లుగా కీ.శే. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి లదే విజయం...
నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన భూమా ఫ్యామిలీ..
తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే తనయ, తనయుడు.....
రాష్ట్ర రాజకీయాల్లో భూమా అఖిల ప్రియ... జిల్లా రాజకీయాల్లో భూమా విఖ్యాత రెడ్డి అరంగేట్రం
ప్రజా సమస్యలపై పోరాడుతూ... ప్రజల పక్షాన ముందుకెళ్తున్న భూమా అఖిల ప్రియ, భార్గవ్, జగత్ విఖ్యాత రెడ్డి
2024 గెలుపే లక్ష్యంగా పయనం
ఆళ్లగడ్డ, (పీపుల్స్ మోటివేషన్):-
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో దివంగత భూమా దంపతులు భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి అంటే ఓటమిని ఎరుగని వారని ప్రజలందరికీ తెలుసు. వారి రాజకీయ జీవితం అందరికీ ఆదర్శం. ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎల్లప్పుడూ ముందుంటారు. కష్టం వచ్చిందని భూమా ఇంటి తలుపు తడితే మేమున్నామని భరోసా కల్పిస్తూ అండగా నిలబడతారు. భూమా దంపతుల అకాల మరణాన్ని ప్రజలు నేటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అలాంటి కుటుంబం నుండి రాజకీయ అరంగేట్రం చేసిన కుమార్తె, కుమారుడు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, భూమా జగత్ విఖ్యాత రెడ్డి లకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
వివరాల్లోకి వెళితే.... మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రాష్ట్ర రాజకీయాల్లోనూ, భూమా విఖ్యాతరెడ్డి, జిల్లా రాజకీయాల్లో భూమా భార్గవ్ నాయుడు చాపకింద నీరులా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ నియోజకవర్గంలో తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటూ వారి సమస్యలను బాగోగులను తెలుసుకుంటూ మేమున్నామంటూ ముందుకెళ్తున్నారు. ప్రతి వర్గంలోనూ వర్గ విబేధాలు ఉన్నప్పటికీ ఆళ్లగడ్డ ప్రజలు చూపు మాత్రం భూమా కుటుంబం ఉంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ జిల్లా వ్యాప్తంగా ఎండనకా వాననకా తెలుగుదేశం పార్టీ గెలుపు దిశ గా అడుగులు వేసింది. నాయకుల వెంట నడుస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకెళ్లారు.
కుట్రలు పన్నినా... జైలు లో పెట్టించినా బెదరని భూమా అఖిల ప్రియ, భార్గవ్...
యువగళం పాదయాత్రను ఫెయిల్ చేయాలని కొందరు కుట్రపన్ని భూమా అఖిల ప్రియ భార్గవ్ లపై పై తప్పుడు కేసులు వేయించి జైలులో పెట్టించారు. అయినా ఆమె బెదరలేదు. లోకేష్ యువగళం పాదయాత్రను ఆళ్లగడ్డలో ఫెయిల్ చేయాలని కొందరు పన్నినా కుట్ర ను భూమా అఖిల ప్రియ ఆమె భర్త భార్గవ్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. జైల్లో ఉన్న భూమా అఖిలప్రియ భార్గవ్ తమదైన శైలిలో భూమా విఖ్యాత రెడ్డికు దిశా నిర్దేశం చేసి ఆళ్లగడ్డ లో నారా లోకేష్ యువగలం భారీగా ప్రజలు హాజరై గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆ రోజే ఆళ్లగడ్డ ప్రజలు భూమా కుటుంబానిదే వచ్చే ఎన్నికల్లో విజయమని గ్రహించిన ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు భూమా దంపతుల మరియు సోదరుడు సమక్షంలో టిడిపి పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. ఎన్ని కేసులు పెట్టినప్పటికీ తగ్గకుండా తమదైన శైలిలో నియోజకవర్గంలో పలు టిడిపి కార్యక్రమాలను ప్రతి గ్రామంలో నిర్వహిస్తూ ప్రజలలో చైతన్యం తీసుకొస్తున్నారు.
ఫలించని ప్రత్యర్థుల జిమ్మిక్కులు..
ప్రత్యర్థులు భూమా కుటుంబం పై విష ప్రచారం చేసినప్పటికీ అవి ఫలించలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రత్యర్థులకు వారికి సానుకూలగా లేని వారిపై అధికార పార్టీ వైసీపీ నాయకులు కేసులు పెట్టించి పైశాచిక ఆనందంతో అధికారం అడ్డం పెట్టుకొని ఆస్తులు అంతస్తులు పెంచుకున్నారని. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు భూమా కుటుంబానికే సంపూర్ణ మద్దతు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో వారికి అండగా ఉండి గెలిపించాలని ప్రతి గ్రామంలో గట్టిగానే ప్రజల పిలుపు వినబడుతోంది.
-విజయం దిశగా భూమా అఖిలప్రియ పయనం...
- టిడిపిలోకి భారీగా చేరుతున్న వలసలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్ సిక్స్ పథకాలను భూమా అఖిలప్రియ, భార్గవ్, విఖ్యాత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తూ వివరిస్తూ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అలాగే రోజురోజుకు పెద్ద యెత్తున టిడిపికి పార్టీలోకి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల నుండి వచ్చి చేరుతున్నారు.
ఇది గమనించిన ప్రత్యర్థులు ఆ పార్టీ మండల నాయకులపై గ్రామ నాయకులపై మన పార్టీలో చేరకపోవడం ఏంటి అని ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల నాయకులు అదే పార్టీలో ఉన్న కొందరిని తీసుకొచ్చి కండువా కప్పి వందలు, రెండు వందలు కుటుంబాలు చేరాయని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని, ప్రత్యర్థులు ఓటమి భయంతోనే ఇలా కొనసాగిస్తే కనీసం డిపాజిట్ అయిన కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రత్యర్థులు ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చికుంటున్నారు..
ప్రత్యర్థుల పార్టీ కార్యకర్తలు నాయకులు చర్చించుకోవడంతో ఆ పార్టీ నాయకులు పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ వారి సమస్యలను ఆసరాగా తీసుకొని వారి ఉనికిని చాటుకుంటున్నారని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ఆళ్లగడ్డ ప్రజలు దీంతో టిడిపి పార్టీకి రోజు రోజుకు బలం చేకూరుతుంది. ఈ ఎన్నికల్లో విజయం దిశగా టిడిపి పార్టీ అభ్యర్థి ముందుకెళ్తున్నారు. ఇక టిడిపి అభ్యర్థి భూమా అఖిలప్రియ విజయం ఖాయమని మరియు మహిళా కోటాలో మరోసారి మంత్రి కావడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.