యువకుడి దారుణ హత్య....
యువకుడి దారుణ హత్య....
నంద్యాల, ఏప్రిల్ 08 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల పట్టణంలో ఓ యువకుడి ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా గొంతు కోసి హత్య చేశారు. త్రీటౌన్ సీఐ నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం గా.. దేవనగర్ కి చెందిన చోట ఇద్రూస్వలి, గౌసియాలు దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు సమీర్ (22) డోర్ పాలిష్ పని చేస్తూ సాయంత్రం చికెన్ పకోడి వ్యాపా రం చేస్తున్నాడు. రంజాన్ మాసం కావడంతో సమీర్ ఇంటిపై ఒక్కడే పడుకుని తెల్లవారుజామున మసీదులో ప్రార్థనకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి యథావిధిగా చికెన్ పకోడి వ్యాపారం ముగించుకుని ఇంటి పైకి వెళ్లి నిద్రపోయాడు. సోమవారం ఉదయం సమీర్ తల్లి ఇంటి పైకి వెళ్లి చూడగా కుమారుడు రక్తపుమడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా గొంతు భాగంలో పదునైన ఆయుధంతో నరికి హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి తండ్రి ఇదూస్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాల కోసం విచారణ చేపట్టారు.