-Advertisement-

ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను...

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను...జగన్ అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోసేస్తాడు...

డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం 

మన సభలు గలగల.... జగన్ సభలు వెలవెల పోతున్నాయి

వైసీపీని చిత్తు చిత్తూగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి 

ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో కొంతయినా మార్పు రాలేదు

సైకో జగన్ రాయలసీమకు ఒక్క పనైనా చేశారా

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం

ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను.

Dhone PRAJAGALAM TDP NATIONAL PRESIDENT CBN, DHONE MLA CANDIDATE KOTLA SURYA PRAKASH REDDY, NANDYAL PARLIAMENT CANDIDATE BYREDDY SHABARI

డోన్, ఏప్రిల్ 29 (పీపుల్స్ మోటివేషన్):-

డోన్ పట్టణంలో సోమవారం రోజు డోన్ ప్రజా గళం సభలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం లో ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే పోలింగ్ స్టేషన్ల దద్దరిల్లిపోయేలా ఉన్నాయి అన్నారు. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైంది ఈ తిరుగుబాటులో జగన్ కొట్టుకుపోవడం ఖాయం అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. డోన్ లో మార్పు వస్తోందని చెప్పారు. శ్రీ లక్ష్మీనరసింహ మద్దిలేటి 

స్వామి ఆశీస్సులు మనకే ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో డోన్ కి అన్ని మంచి రోజులే వస్తాయని చెప్పారు. జగన్ నవరత్నాలు నవ మోసాలని విమర్శించారు. జగన్ మేనిఫెస్టోకు జనం జీరో మార్కులు ఇస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీసూపర్ సిక్స్.. సూపర్ హిట్ అని తెలిపారు. డోన్ నియోజకవర్గం లోని గ్రామాలలో తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. మన సభలు గలగల.... జగన్ సభలు వెలవెల పోతున్నాయని సెటైర్లు గుప్పించారు. సోమవారం నాడు జిల్లాలోని డోన్ లో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు డోన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టికెట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించానని చెప్పుకొచ్చారు.

వైసీపీలో ఉన్న రెడ్లు వైసీపీ అభ్యర్థులు ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 7 అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. తుంగభద్ర నది ప్రవహిస్తోంది. కానీ తాగు, సాగునీటి సమస్య జఠిలంగా ఉంది. కూటమి వల్లనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో కొంతయినా మార్పు రాలేదన్నారు. సైకో జగన్ రాయలసీమకు ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. జగన్కు నీటి విలువ తెలియదని... నీరు లేక 80వేల మంది వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమలో జగన్ 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడన్నారు, కర్నూలు జిల్లాలో సాగు, తాగు నీటికి శాశ్వత పరిష్కారం కోసం ఆర్డీఎస్కు రూ.1,955 కోట్లు.. వేదవతికి రూ.1,942 కోట్లు కేటాయిస్తే.. జగన్ ఎందుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని చంద్రబాబు

ప్రశ్నించారు. 2015లో గుండ్రేవుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని చెప్పారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. జగన్ 7 సార్లు కరెంటు బిల్లులు పెంచారని.. తాను అధికారంలోకి వస్తే కరెంటు బిల్లులు పెంచనని.. నాణ్యమైన కరెంటు ఇస్తానని హామీ ఇచ్చారు. నాసిరకం మద్యం అమ్ముతూ... అడబిడ్డల తాళి బొట్లను జగన్ తెంపుతున్నారని ఫైర్ అయ్యారు. డోన్ నియోజకవర్గ ప్రజలు జగన్ ఇచ్చే నాసిరకం మద్యం తాగలేక పక్కన ఉన్న

కర్నాటకకు, తెలంగాణ కు వెళ్లి మద్యం తాగివస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదని.. జే బ్రాండ్.. గంజాయి ఇచ్చారని ఆక్షేపించారు. జగన్ మేనిఫెస్టోలోనిరుద్యోగులకు ఏమైనా హామీ ఇచ్చారా అని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అవగానే నిరుద్యోగ భృతి ఇస్తా. పోలీసులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను.టికెట్ల కేటాయింపులో తాము సామాజిక న్యాయం పాటించామని వెల్లడించారు. ఆస్తిపాస్తులు లేకపోయినప్పటికీ కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చామని వెల్లడించారు. మరోవైపు, కొన్ని కారణాల వలన సూర్య ప్రకాశ్ రెడ్డి కి  ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశామని వెల్లడించారు. ధర్మారం సుబ్బారెడ్డికి కచ్చితంగా న్యాయం చేస్తానని అన్నారు కర్నూలు పార్లమెంటు స్థానంతో పాటు, పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తామే గెలుస్తున్నామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. "పక్కనే తుంగభద్ర ఉన్నా తాగడానికి నీళ్లున్నాయా మీకు? సాగునీరు వచ్చిందా? ఇసుక మాఫియా ఉండా, లేదా? ఇసుక దొంగిలించే నాయకులు ఒక్క పని చేశాడా? ఒక ఊరికైనా మంచి నీరు ఇచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చాడా?ఈసారి ఎన్నికల్లో గెలిచేది కూటమి అభ్యర్థులే.

కూటమి వస్తేనే మళ్లీ అభివృద్ధి చెందుతుంది. ఈ ముఖ్యమంత్రి ఒక సైకో. ఈ. సైకోను నమ్ముకుని అందరూ మునిగిపోయారు. ప్రజలందరూ బాగుంటే నేను ఓటు అడగను... మీరందరూ బాగున్నారా? ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల జీవితాల్లో ఎంతో కొంత మార్పు రావాలి కదా. వచ్చిందా మార్పు? రాయలసీమలో 52 సీట్లలో గెలిపించారు....

పాదయాత్రలో మోసాలు చేశాడు, అబద్ధాలు చెప్పాడు... నెత్తిన చెయ్యి పెట్టాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు... మీరందరూ ఐస్ అయిపోయారు. ప్రజలది వెన్నలాంటి మనసు... అతడ కరడుగట్టిన ఉగ్రవాది. ఆ ఉగ్రవాది నాటకానికి నా ప్రజానీకం బలైపోయారు... అదే నా బాధ! ఇతడికి నీటి విలువ తెలుసా? రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు... నీరు జీవితాలను మార్చుతుంది. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు. టెక్నాలజీ యుగంలో కూడా ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతోంది. 40 ఏళ్లు మీరు నన్ను ఆదరించారు. నా జీవితాశయం ఒకటే, ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని సమాజాన్ని చూడాలి... అందుకోసం నేను కృషి చేస్తాను. సంపద సృష్టిస్తా... ఆదాయం పెంచుతా... ఆ ఆదాయాన్ని మీకు పంచుతా... చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి ఆ అడబిడ్డలను లక్షాధికారులను చేస్తా. ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా... మహాశక్తి పథకంలో భాగంగా అడబిడ్డలకు నాలుగు కార్యక్రమాలు ఇస్తున్నా, ప్రతి అడబిడ్డకు నెలకు. రూ.1500... ఏడాదికి రూ.18 వేలు, ఐదేళ్లలో రూ.90 వేలు. ఇస్తాం. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లల కోసం ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పన అకౌంట్లలో వేస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఈ నాలుగే కాదు... ద్వాక్రా సంఘాల వారికి కూడా హామీ ఇస్తున్నా... రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తా" అని చంద్రబాబు వివరించారు.

Comments

-Advertisement-