-Advertisement-

మగవారిలో తగ్గి పోతున్న స్పెర్మ్ కౌంట్.. ఆహారంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులే...హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ

health news india world health news today good health news interesting health articles health news hindi public health news health news in Telugu pdf
Peoples Motivation

మగవారిలో తగ్గి పోతున్న స్పెర్మ్ కౌంట్.. ఆహారంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులే...

పెళ్లయినా పిల్లలు పుట్టని జంటలు ఎన్నో.. కారణం కౌంట్ తగ్గిపోవడమేనట

పురుషుల్లో ఏకంగా 62 శాతం తగ్గిన స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ నాణ్యత కూడా 51 శాతానికి పడిపోయిందన్న పరిశోధకులు...

ఆహారంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులు...

-హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ

Sexual sperm count decrease in males
ప్రతీ ఏటా ఎంతోమంది వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.. అయితే, ఏళ్లు గడుస్తున్నా తల్లిదండ్రులుగా మాత్రం మారడంలేదు. కొన్నేళ్ల పాటు పిల్లలు వద్దని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ తర్వాత తల్లిదండ్రులుగా మారాలని అనుకున్నా సాధ్యం కావడంలేదట. దీనికి కారణం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడమేనని తాజా సర్వే ఒకటి తేల్చింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 53 దేశాలకు చెందిన పురుషులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ తాజా సర్వేలో తేలింది. ఈమేరకు 1973 నుంచి 2018 మధ్య కాలంలో 223 పత్రికలు, మ్యాగజైన్స్ కథనాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్లు హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ వెల్లడించింది.

కౌంట్ పడిపోవడమే కాదు నాణ్యత కూడా తగ్గిందని ఈ సంస్థ తెలిపింది. కౌంట్ విషయానికి వస్తే 62.3 శాతానికి తగ్గగా.. నాణ్యత 51.6 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. 53 దేశాలకు చెందిన 57 వేల మంది పురుషుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించి ఈ వివరాలను కనుగొన్నట్లు తెలిపింది. దీనికి పలు కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైంది జీవనశైలిలో మార్పులేనని పరిశోధకులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, టెన్షన్, ఆహారం.. అన్నీ కలిసి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోవడానికి కారణమవుతున్నాయని వివరించారు. ముందు ముందు ఈ సమస్య మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. ఆహారంతో పాటు జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోకుంటే సంతానభాగ్యానికి నోచుకోలేరని హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ హెచ్చరించింది.

Comments

-Advertisement-