బైండోవర్ అంటే ఏమిటి..? ఎందుకు బైండోవర్ కేసులు పెడతారు..?
bindover case meaning in telugu
bind over case in police station
bind over case section
what is bind over case in india
is a bind over a criminal conv
By
Peoples Motivation
బైండోవర్ అంటే ఏమిటి..? ఎందుకు బైండోవర్ కేసులు పెడతారు..?
బైండోవర్ అంటే (నాన్ ఫర్ గుడ్ బిహే వియర్) అని అర్థం. ఎన్నికల వేళ పలానా వ్యక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే అతని చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని తెలిస్తే పోలీసులు బైండోవర్ చేస్తారు. అలాంటి వ్యక్తులను తాసిల్దార్ లేదా ఆర్డిఓ ఎదుట హాజరు పరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయబోమని అతనిపై బాండ్ పేపర్ మీద లిఖితపూర్వకంగా హామీ తీసుకుంటారు. సంబంధిత తహసిల్దార్ వారికి బైండోవర్ ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఆ తర్వాత సొంత పూచికత్తుపై అదే రోజు విడుదల చేస్తారు. అలా బైండోవర్ అయినా వ్యక్తి ఆ రోజు నుంచి ఏడాది వరకు ఇలాంటి నేరాలకు పాల్పడకూడదు అలా పాల్పడితే లిఖితపూర్వకంగా ఇచ్చిన బాండ్లో ఎంత మొత్తం నమోదు చేసి ఉంటారో.. అంత మొత్తం ఫెనాల్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించకపోయినా నేరం కిందనే పరిగణిస్తారు. ఐపిసి సెక్షన్లు 106, 107, 108, 110 కింద రెండు అంతకన్నా ఎక్కువసార్లు బైండోవర్ అయితే అతనిపై రౌడీ సీటు కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల వేళ గుంపులు గుంపులుగా వెళ్ళి గొడవ పడటం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వంటి చర్యలకు పాల్పడకూడదు.
👉ఎవరైనా పౌరులు తమపై అక్రమంగా పోలీసులు బైండోవర్ పెట్టాలని భావిస్తే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసి రెండు వర్గాల వాదనలు విన్న తర్వాత కేసు పై నిర్ణయం తీసుకుంటుంది.
Comments