ఏదో జరుగుతుంది.....?
ఏదో జరుగుతుంది.....?
నేక్కొండ, ఏప్రిల్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
నర్సంపేట డివిజన్ పరిధిలో గల మండలాల్లో అధికారులకు మధ్యం పై అంత మమకారం ఎందుకో ఆని ప్రజలు ముక్కున వ్రేలు వేసుకుంటున్నారు. వైన్స్ షాపుల ప్రోత్సహమా .. బెల్ట్ షాపుల నిర్వహకమా, అడ్డు అదుపు లేదు... అపేవారు అసలే లేరు. నేక్కొండ నర్సంపేట డివిజన్ పరిధిలోనే అతి పెద్ద మండలం గా గుర్తింపు వున్న చెప్పుకోవడానికి సున్న అన్నట్టుగా వుంది మధ్య నిషేధం,మండలంలో 39 గ్రామ పంచాయతీలు వున్న మధ్య నిషేధం యే ఒక్క గ్రామంలో కుడా లేదు అనే విషయం బాధాకరం గా వున్న అధికారులకు మాత్రం మాకేం సంబంధం ఆన్నటుగా వుంది ఆని విమర్శలు వస్తున్న వినపడ నట్టు కల యపన చేస్తున్నారు. అక్రమంగా బెల్ట్ షాప్ ల ద్వారా జోరుగా మధ్యం అమ్మకాలు జరుగుతున్న .. రోజు రోజుకు గ్రామాల్లో బెల్ట్ షాప్లు పెరుగుతున్న రోజు రోజు కు మద్యానికి బానిసై గురి అవుతున్నారు. అయినా పలు పత్రికలో ప్రచురించిన కొన్ని గ్రామాల్లో నే మెరుపు దాడులు జరిపి చేతులు దులుుకుంటున్నారు ఆని పెద్ద ఎత్తున విమర్శలు, అరోపణలు వస్తున్న మాకేం వినపడవు అన్నట్టుగా వుంది అధికారుల పని తీరు. సంపూర్ణ మధ్య నిషేధం లేదు, మధ్య రహిత గ్రామాలుగా ఏర్పాటు చేయటం లేదు,ఆని అరోపణలు వస్తున్నాయి.
ఏదో జరుగుతుంది......?
గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహణ అక్రమం ఆని తెలిసిన గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వార మద్యం విక్రయం చట్ట విరుద్ధం అని తెలిసిన మెరుపు దాడులతో రిజిష్టర్ తనికీలతో కాల యాపన చేస్తున్నారు అంటు బహిర్గతంగా అరోపణలు వస్తున్నాయి.
బెల్ట్ షాపుల నిషేధం కల యేనా.....?
మండలం లో యే ఒక్క గ్రామంలో మధ్యం దొరకని గ్రామం లేదు, పుట్ట గొడుగులు లా పుట్టు కోస్తున్న ఆపలేని స్థితిలో ఆ అధికారులు. బెల్ట్ షాప్ ల నిషేధం ఒక కల. గానే వుంటుందా... అంటూ ఆరోపణలు వస్తున్నాయి.