-Advertisement-

నేను మీ ఇంటి ఆడపడుచును మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి...

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

నేను మీ ఇంటి ఆడపడుచును మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి...

-గౌరు చరిత రెడ్డి

Gowri Charitha Reddy
ఓర్వకల్లు/ కర్నూలు, ఏప్రిల్ 20 (పీపుల్స్ మోటివేషన్):- 

ఓర్వకల్లు మండలం గుట్టపాడు,యన్ కొంతల పాడు, ఉప్పులపాడు గ్రామలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని,ఈ వైసిపి ప్రభుత్వం లో ఏ అభివృద్ది జరగలేదు అని,చంద్రబాబు ని ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట ప్రజలకు చాలా అవసరం అని అభ్యర్థిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి.

ఈ కార్యక్రమంలో యన్ కొంతల పాడు గ్రామం లో ఈరోజు టీడీపీ అధినేత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చరితమ్మ  టీడీపీ, బిజెపి, జనసేన శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప్పులపాడు గ్రామo వైసిపి పార్టీ కి చెందిన సుధాకర్,రంగస్వామి తో పాటు 10 కుటుంబాలు గౌరు చరిత రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరిని చరితమ్మ పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు

ఈ కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు మరియు టీడీపీ బిజెపి జనసేనా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-