రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎన్నికల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి కొత్త వెబ్‌సైట్

General elections 2024, Loksabha Elections 2024, new Voters form 6, form 8 application, Assembly Elections 2024, Parliament Elections,MP&MLA Elections
Peoples Motivation

ఎన్నికల్లో తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడానికి కొత్త వెబ్‌సైట్

'మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్' పేరిట వెబ్‌సైట్ తీసుకువ‌చ్చిన ఈసీ

వెబ్‌సైట్‌ను ప్రారంభించిన‌ సీఈసీ రాజీవ్ కుమార్‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు జ్ఞానేశ్వ‌ర్‌ కుమార్‌, సుఖ్‌బీర్ సింగ్ సంధు 

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఖచ్చిత‌మైన స‌మాచారం అందించ‌డ‌మే ఈ కొత్త వెబ్‌సైట్ ల‌క్ష్యం

వివరాలు వెల్లడించిన ఈసీ

డిల్లీ, ఏప్రిల్ 02 (పీపుల్స్ మోటివేషన్):-

లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) 'mythvsreality.eci.gov.in' ( మిథ్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ ) పేరుతో ఓ కొత్త వెబ్సైట్ను రూపొందించింది. దీనిని మంగళవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖీబీర్ సింగ్ సంధు ప్రారంభించారు. అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని.. ఎన్నికల సమయంలో ప్రజలకు ధ్రువీకరించిన కచ్చితమైన సమాచారం అందించే దిశగా దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను, వెలుగులోకి వచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టరు ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలుపుతామని పేర్కొంది.

Election commission new website

Comments

-Advertisement-