-Advertisement-

ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తీసేసుకోవచ్చా.? -సుప్రీంకోర్టు వాఖ్యలు

supreme court judgement pdf supreme court today judgement supreme court case status supreme court of india judgements supreme court judgement today li
Peoples Motivation

ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం తీసేసుకోవచ్చా.? -సుప్రీంకోర్టు వాఖ్యలు

ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించలేమనడం ప్రమాదకరమం

గనులు, ప్రైవేటు అడవులను ఉదాహరణగా ప్రస్తావించిన సీజేఐ ధర్మాసనం

ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక ఆర్టికల్ 39 వర్తించదని అనలేమని వ్యాఖ్య

సమాజంలో పరివర్తన తీసుకురావాలన్నది రాజ్యాంగ ఉద్దేశం

- సుప్రీంకోర్టు సీజేఐ

SUPREME COURT JUDGEMENTS
డిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రైవేటు ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదనే వాదన సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాక ఇక ఆర్టికల్ 39 (బి) వర్తించదని చెప్పలేమంటూ వ్యాఖ్యానించింది. ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించకూడదనడం ప్రమాదకరమని పేర్కొంది. సమాజ సంక్షేమం కోసం సంపద పునఃపంపిణీ జరగాల్సిందేనని వెల్లడించింది. ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. 

 ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై బుధవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ముంబైకి చెందిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీవోఏ) తో పాటు పలువురు పిటిషన్ దారుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (బి), 31 (సి) ను ఉదహరిస్తూ.. ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదని వాదించారు. అయితే, సుప్రీం ధర్మాసనం ఈ వాదనలతో విభేదిస్తూ.. ‘ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులని, ప్రైవేటు వనరులను ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదని అనలేం.. ప్రైవేటు గనులు, ప్రైవేటు అడవుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదనడం తగదు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జమీందారీ వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి ఉదహరించారు.

"సమాజంలో పరివర్తన తీసుకురావాలన్నది రాజ్యాంగ ఉద్దేశం. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాక దానికి 39 (బి) అధికరణం వర్తించదని చెప్పలేం. సమాజానికి సంక్షేమ చర్యలు అవసరం. అందువల్ల సంపద పునఃపంపిణీ జరగాల్సిన అవసరం ఉంది" అని తెలిపింది. ఈ సందర్భంగా జమీందారీ వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు వీలు కల్పించే మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది పూర్తిగా భిన్నమైన అంశమని ధర్మాసనం తెలిపింది. దానిపై విడిగా ఉత్తర్వులిస్తామని స్పష్టంచేసింది.

Comments

-Advertisement-