-Advertisement-

ఫ్యాన్ కి ఓటేస్తే దానికే ఉరి వేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది...

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ఫ్యాన్ కి ఓటేస్తే దానికే ఉరి వేసుకోవాల్సిన దుస్థితి వస్తుంది... కర్నూలు టిడిపి అభ్యర్థి టిజి భరత్

అర్హులకు ఇల్లు, ఇళ్ల పట్టాలు అందజేస్తా... టిజి భరత్

25వ వార్డులో టిజి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం

TG BHARATH KURNOOL TDP MLA CANDIDATE
కర్నూలు, ఏప్రిల్ 22 (పీపుల్స్ మోటివేషన్):-

కర్నూలు ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఐదేళ్లపాటు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టిజి భరత్ అన్నారు. నగరంలోని 25వ వార్డులో ఆయన టిజి భరత్ భరోసా యాత్ర చేపట్టారు. దేవ నగర్, గాయత్రి ఎస్టేట్, బిర్లాగడ్డలో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను తాను గెలవగానే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని భరత్ మహిళలకు హామీ ఇచ్చారు. యువతతో మాట్లాడుతూ తనను గెలిపించాక తనకున్న నెట్వర్క్ తో కర్నూలుకు పరిశ్రమలు తీసుకొస్తానని చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుంటానని చెప్పారు. ఇప్పుడున్న పాలకులు డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా, చెత్తాచెదారం రోడ్లపై ఉన్నా పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. తద్వారా ఎంతోమంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు, ఇళ్ల పట్టాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. తమ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పేదల కోసం టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడితే.. ఈ వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయకుండా అలాగే వదిలేసిందన్నారు. తద్వారా లబ్ధిదారులకు ఇల్లు అందకుండా పోయాయని ఆయన మండిపడ్డారు. తాము వచ్చిన వెంటనే మళ్ళీ ఇళ్లను నిర్మించి పేదలకు అందజేసే బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇంచార్జి అర్షద్, వార్డు ఇంచార్జి రాజశేఖర్ యాదవ్, నాగయ్య, మధు, మహేష్, బాలు, కల్లు శ్రీను, సుధాకర్ రెడ్డి, సత్యరాజ్, రమణయ్య శెట్టి, మధు,  మహబూబ్ బాషా, మద్దిలేటి, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ, జనసేన పవన్, తదితరులు పాల్గొన్నారు.

TG BHARATH KURNOOL TDP MLA CANDIDATE

టిజి భరత్ భరోసా యాత్ర ముగిసిన అనంతరం బిర్లా గడ్డలో 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. రానున్న ఎన్నికల్లో టి.జి భరత్ ను భారీ మెజారిటీతో గెలుపిస్తామని పార్టీలో చేరిన వాళ్ళు చెప్పారు.

Comments

-Advertisement-