బ్రెయిన్ ను చురుగ్గా ఉంచాలంటే ఏం చేయాలి..?
బ్రెయిన్ ను చురుగ్గా ఉంచాలంటే ఏం చేయాలి..?
మైండ్ పవర్ ను పెంచే బ్రెయిన్ గేమ్స్
క్రాస్ వర్డ్ పజిల్స్ తోనూ బ్రెయిన్ కు మేత
వ్యాయామం, కుట్లు అల్లికలతో పెరగనున్న ఏకాగ్రత
ఉరుకులు పరుగుల జీవితంలో రోజువారీ పనులను చక్కబెట్టేందుకు మెదడు ఏకాగ్రత చాలా అవసరం
ఉరుకులు పరుగుల జీవితంలో రోజువారీ పనులను చక్కబెట్టేందుకు మెదడు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం.. శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఫిట్ గా ఉండడానికి వ్యాయామం చేసినట్లే రోజూ బ్రెయిన్ ఎక్సెర్ సైజ్ చేయడమూ ముఖ్యమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడుకు మేత పెట్టేందుకు రోజూ చేయాల్సిన కొన్ని పనులను సూచించారు.
జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి చిట్కాలు..
దినపత్రికలలో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్ తో కుస్తీ పట్టడం ఇందులో ఒకటి. ఈ పజిల్స్ పూర్తిచేయడం అలవాటుగా చేసుకుంటే బ్రెయిన్ కు తగిన వ్యాయామం కల్పించినట్లేనని అంటున్నారు. మెదడు ఉత్తేజితం కావడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి క్రాస్ వర్డ్ పజిల్స్ ఉపయోగపడతాయని చెప్పారు. బ్రెయిన్ ఎక్సెర్ సైజ్ చేయడం ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు థింకింగ్ స్కిల్స్ పెంచుకోవచ్చని తెలిపారు.
మొబైల్ ఫోన్ పట్టుకుని సోషల్ మీడియాలో మునిగితేలడం కాకుండా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న బ్రెయిన్ గేమ్స్ ఆడడం వల్ల మెమరీని మెరుగుపర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జిగ్ సా పజిల్స్ పూర్తిచేయడం కూడా మెదడుకు మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందన్నారు. కుట్లు, అల్లికలకు ఎంతో ఏకాగ్రత అవసరమని, దీనివల్ల మెదడు చురుగ్గా ఉంటుందని వివరించారు. డ్యాన్స్ అంటే ఇష్టపడే వారు ఎంచక్కా మంచి మ్యూజిక్ పెట్టుకుని సరదాగా స్టెప్పులేస్తూ మెమరీ పవర్ ను పెంచుకోవచ్చని చెప్పారు. ఇక, శరీర దృఢత్వానికి తోడ్పడే కసరత్తులు మెదడునూ ఉత్తేజితం చేస్తాయని, నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఇటు శరీరాన్ని, అటు మెదడునూ ఫిట్ గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.